సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, యూట్యూబ్‌లో వర్చువల్ ఈవెంట్ లైవ్ ద్వారా పోకో ఎక్స్ 3 భారతదేశంలో ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన పోకో ఎక్స్ 2 తరువాత మోడల్ ఇది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఒక కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, యూట్యూబ్‌లో వర్చువల్ ఈవెంట్ లైవ్ ద్వారా పోకో ఎక్స్ 3 భారతదేశంలో ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన పోకో ఎక్స్ 2 తరువాత మోడల్ ఇది.
ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన పోకో ఎక్స్ 3 ఎన్‌ఎఫ్‌సికి అడ్జస్ట్ చేసిన కొత్త వేరియంట్. పోకో ఎక్స్ 3 ఇండియన్ వేరియంట్ మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్, రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంది.
భారతదేశంలో పోకో ఎక్స్ 3 ధర, లభ్యత
పోకో ఎక్స్ 3 బేస్ వేరియంట్ 6జీబీ+64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999, 6జీబీ +128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.18,499, 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.19,999. ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ కోబాల్ట్ బ్లూ, షాడో గ్రేలో వస్తుంది. సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇండియాలో సేల్స్ ప్రారంభమవుతాయి.
also read
పోకో ఎక్స్ 3 ఫీచర్స్
ఆండ్రాయిడ్ 10 ఆధారంగా డ్యూయల్ సిమ్ (నానో) పోకో ఎక్స్ 3 MIUI 12పై నడుస్తుంది. 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,340 పిక్సెల్స్) డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి సోసి ప్రాసెసర్, అడ్రినో 618 జిపియు, 8 జిబి వరకు ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్‌తో పనిచేస్తుంది.
ఫోటోలు, వీడియోల కోసం క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ 119-డిగ్రీల వైడ్ యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్ కెమెరా, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, చివరగా ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ f / 2.2 లెన్స్ కెమెరా పొందుతారు.
పోకో ఎక్స్ 3 128జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై, బ్లూటూత్, 4జి, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో భారీ 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఇందులో ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఫోన్ 215 గ్రాముల బరువును ఉంటుంది.