పోకో ఎఫ్ 2 ప్రో ధర బేస్ వర్షన్ 6జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 499 యూరోల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రం పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ పై వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫిబ్రవరిలో పోకో ఎక్స్ 2 ను ఇండియాలోకి ప్రవేశించింది, ఇది ఇప్పటివరకు రియల్ మీ 6 ప్రో, షియోమి రెడ్ మీ నోట్ 9 ప్రోకి గట్టి పోటీని ఇస్తుంది.
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ పోకో ఎఫ్2ప్రోను కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అధికారికంగా ఆవిష్కరించింది. మార్చిలో లాంచ్ అయిన రెడ్‌మి కె30 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది. ఇది పాప్-అప్ సెల్ఫీ కెమెరా, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌ఓసి తో వస్తుంది. తాజా పోకో ఫోన్ గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్, 5 జి సపోర్ట్‌తో వస్తుంది.
పోకో ఎఫ్ 2 ప్రో బేస్ మోడల్ 6 జిబి 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 499 యూరోలు (సుమారు రూ. 41,500), అయితే 8 జిబి + 256 జిబి స్టోరేజ్ ధర 599యూరోలు (సుమారు రూ .50,000). ఫోన్ సైబర్ గ్రే, ఎలక్ట్రిక్ పర్పుల్, నియాన్ బ్లూ, ఫాంటమ్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
అంతేకాకుండా, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గేర్‌బెస్ట్, అలీఎక్స్‌ప్రెస్ ద్వారా $ 499.99 (సుమారు రూ. 37,900) నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ త్వరలో పోకో.నెట్, అమెజాన్, లాజాడా, షాపీ, జెడి సెంట్రల్ ఇంకా ఇతర ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు చేయనుంది.
.
భారతదేశంలో మాత్రం పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ పై వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫిబ్రవరిలో పోకో ఎక్స్ 2 ను ఇండియాలోకి ప్రవేశించింది, ఇది ఇప్పటివరకు రియల్ మీ 6 ప్రో, షియోమి రెడ్ మీ నోట్ 9 ప్రోకి గట్టి పోటీని ఇస్తుంది.
also read యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో హువావే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు
ఎంట్రీ లెవల్ 6 జిబి ర్యామ్ 128 జిబి స్టోరేజ్ మోడల్ కోసం రెడ్‌మి కె 30 ప్రోను సిఎన్‌వై 2,999 (సుమారు రూ. 31,900) ప్రారంభ ధరతో మార్చిలో చైనాలో విడుదల చేశారు.
పోకో ఎఫ్ 2 ప్రో ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో) , ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1,080x2,400) హెచ్‌డిఆర్ 10 అమోలెడ్ డిస్‌ప్లే, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌ఓసి, ఫోటోలు, వీడియోల కోసం క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ స్నాపర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
స్టోరేజ్ పరంగా పోకో ఎఫ్ 2 ప్రో 256 జిబి వరకు యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉంది, ఇది మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్స్ లో డ్యూయల్-మోడ్ 5జి (ఎన్‌ఎస్‌ఏ ఎస్‌ఏ), 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్ లో 4,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.