మహిళలు ఆకాశంలో సగం అంటారు.. ఆ అవకాశాన్ని ఈ- కామర్స్ మేజర్ ‘ఫ్లిప్‌కార్ట్’సద్వినియోగం చేసుకోతలపెట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన వినియోగదారులకు భారీగా డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్లపై రూ.2000 డిస్కౌంట్లతోపాటు ల్యాప్ టాప్ కంప్యూటర్లు, టాబ్లెట్లు అతి తక్కువ ధరలకే వినియోగదారులకు లభించనున్నాయి. మరీ మీరు త్వర పడండి.. డీల్ చేసుకోండి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ నెల 7, 8 తేదీల్లో భారీ డిస్కౌండ్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు సంస్థల స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైనా రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించనున్నది. ఆకర్షణీయమైన ఆఫర్లతో లాప్ టాప్‌లు రూ.12,900, టాబ్లెట్లు రూ.2999లకే లభ్యం కానున్నాయి.
హానర్ 9ఎన్, నోకియా 6.1 ప్లస్, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, వివో వీ9 ప్రో, మోటో వన్ పవర్ మోడళ్లపై డిస్కౌంట్లు అందించనున్నది. అంతేకాక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లాప్‌టాప్ కంప్యూటర్లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80% వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనున్నది. ఎంపిక చేసిన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ల నుంచి నో కాస్ట్ ఈఎంఐ వసతి కూడా కల్పిస్తుంది.
ఇందులో భాగంగా రూ. 11,999గా ఉన్న హానర్ 9ఎన్ ఫోన్ పై ధర రూ.11,999 కాగా, రూ.2000 డిస్కౌంట్‌తో రూ. 9,999కే లభించనున్నది. రూ. 15,499గా ఉన్న నోకియా 6.1 ప్లస్ రూ.13,999, వివో వీ9 ప్రోపై రూ. 2000 డిస్కౌంట్‌తో రూ. 13,990కి కొనుగోలు చేసుకోవచ్చు.
వివో వీ9 ప్రోపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ. 1500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 రూ. 30,990కే పొందవచ్చు. జెన్‌ఫోన్ లైట్ ఎల్1పై అత్యధికంగా రూ. 4,999 డిస్కౌంట్‌పై లభించనుంది. రూ. 71 వేలుగా ఉన్న 64 జీబీ గూగుల్ పిక్సెల్ 3 ఉమెన్స్ డే సేల్‌లో భాగంగా రూ.59,999 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. టాబ్లెట్ ధరలు రూ.2,999 నుంచి మొదలవుతాయి.
హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 70 శాతం వరకు డిస్కౌంట్‌తో రూ. 2,999 నుంచి, ల్యాప్‌టాప్‌లు రూ.12,990 నుంచి లభించనున్నాయి. మరోవైపు ఈ సేల్ జరుగుతున్న రెండు రోజులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి బ్లాక్‌బస్టర్ డీల్స్, ప్రతి గంటకొకసారి ఓమైగాడ్ డీల్స్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఇక బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఈఎంఐ నెట్‌వర్క్ కార్డ్స్‌పై ఈఎంఐ కాస్ట్ లేనేలేదు. ఇంకా టీవీలు, హోం అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 5 ధర రూ.9999 నుంచి రూ.7,999లకు లభిస్తుంది. పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్ లాంచింగ్ ధర రూ.71 వేలపై రూ.59,999లకే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. త్వరలో విపణిలో అడుగు పెట్టనున్న శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, పోకో ఎఫ్1 మోడల్ ఫోన్లపైనా, ఐఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.