ఈ హెడ్‌ఫోన్ ధర రూ. 899 నుండి ప్రారంభమై రూ. 14,999 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ హెడ్‌ఫోన్‌లన్నీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ పానాసోనిక్ వైర్‌లెస్, వైర్డ్ మోడళ్లతో సహా ఐదు కొత్త హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్ ధర రూ. 899 నుండి ప్రారంభమై రూ. 14,999 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ హెడ్‌ఫోన్‌లన్నీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త పానాసోనిక్ హెడ్‌ఫోన్‌లు జెబిఎల్, స్కల్ క్యాండి వంటి ప్రధాన బ్రాండ్లకు పోటీగా లాంచ్ చేసింది. కొత్త లాంచ్‌లలో పానాసోనిక్ హెచ్‌టిఎక్స్ 90 హెడ్‌ఫోన్స్ ధర రూ. 14,999 ఉంది.
పానాసోనిక్ హెచ్‌టిఎక్స్ 90 ధర, ఫీచర్స్
పానాసోనిక్ హెచ్‌టిఎక్స్ 90 ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్ ధర రూ. 14,999. బ్లూటూత్ ద్వారా ఆక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, వైర్‌లెస్ కనెక్టివిటీని ఆప్షన్ ఉన్నాయి. ఒకసారి ఛార్జీ చేస్త్తే 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. హెడ్ ఫోన్లు నేవీ బ్లూ, మాట్టే బ్లాక్, వనిల్లా వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
పానాసోనిక్ హెచ్‌టిఎక్స్ 20 ధర, ఫీచర్స్
పానాసోనిక్ నుండి కొత్త రేంజ్ ప్రాడక్ట్ హెచ్‌టిఎక్స్ 20 వైర్‌లెస్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్. దీని ధర రూ. 5,999, ఈ ఇయర్‌ఫోన్‌లు మెడ వెనుక ఉండే కేబుల్ రెట్రో స్టైలింగ్ కలిగి ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 8.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇయర్ ఫోన్లలో 9 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించారు. గోధుమరంగు, ఎరుపు, బూడిద, నలుపు రంగులలో లభిస్తాయి.
పానాసోనిక్ ఎన్‌జే310 ధర, ఫీచర్స్
దీని ధర రూ. 3,599, పానాసోనిక్ ఎన్‌జే310 అనేది వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, ఇందులో హెచ్‌టిఎక్స్20 ఇయర్‌ఫోన్‌లాగానే మెడ వెనుక ఫ్రీ కేబుల్ డిజైన్ ఉంటుంది. ఎన్‌జే310 ఫీచర్ 9 ఎంఎం డ్రైవర్లు, 6 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటాయి. నలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు అనే ఐదు రంగులలో లభిస్తాయి.
పానాసోనిక్ టిసిఎం 130, పానాసోనిక్ టిసిఎం55 ధర, ఫీచర్స్
టిసిఎం 130 ధర రూ. 1,399, టిసిఎం55 ధార రూ.899. ఈ రెండు పానాసోనిక్ ఇయర్‌ఫోన్‌లు అత్యంత బడ్జెట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్, ఈ రెండు ఇయర్‌ఫోన్‌లు 3.5 ఎంఎం వైర్డు కనెక్టివిటీని ఉపయోగిస్తాయి.