బడ్జెట్ ధరకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు...జూలై 2న లాంచ్

By Sandra Ashok Kumar  |  First Published Jun 9, 2020, 3:41 PM IST

భారతదేశంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడళ్లు మిడ్ రేంజ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టివిగా ఉంటాయి అని తెలిపింది. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ వు, షియోమి బ్రాండ్‌లకు  పోటీగా నిలుస్తుంది.  


స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తాజాగా ఇండియాలో రెండు కొత్త టి‌విలను లాంచ్ చేయనుంది. వచ్చే నెల జూలై 2న ఈ రెండు కొత్త సిరీస్‌ టీవీలను దాని స్మార్ట్ టివి లైనప్‌లో జోడించనుంది. భారతదేశంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడళ్లు మిడ్ రేంజ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టివిగా ఉంటాయి అని తెలిపింది.

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ వు, షియోమి బ్రాండ్‌లకు  పోటీగా నిలుస్తుంది.  వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సిఇఒ పీట్ లా సోమవారం పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా రియల్‌ మీ కూడా భారతదేశంలో బడ్జెట్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. 

Latest Videos

అయితే రెండు కొత్త వన్‌ప్లస్ టీవీలు వేర్వేరు స్క్రీన్ సైజులో ఉంటాయి. వన్‌ప్లస్ సంస్థ కొత్త స్మార్ట్ టీవీలను సుమారు రూ. 15,000 ప్రారంభ ధరకు అందించాలని చూస్తుంది.

also read టెలికం వినియోగదారులపై చార్జీల మోత..చౌక డేటా, కాల్స్‌ సేవలకు రాంరాం..

భారతీయ కస్టమర్లకోసం ప్రీమియం స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ. 69.900 ప్రారంభ ధరల్లో గత ఏడాది దేశంలో వన్‌ప్లస్ రెండు వేరియంట్‌లలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీల ఫీచర్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏదేమైనా కొత్త మోడల్స్ బెస్ట్-ఇన్-క్లాస్ డిస్ ప్లే ప్యానెల్స్‌తో వస్తుందని కంపెనీ తన విడుదలలో పేర్కొంది.  

click me!