5జి సపోర్ట్ తో షియోమీ రెడ్ మి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్...

By Sandra Ashok Kumar  |  First Published May 26, 2020, 5:28 PM IST

రెడ్‌మి 10 ఎక్స్‌ స్మార్ట్  ఫోన్ 4జి, 5జి వేరియంట్లలో అందిస్తుండగా, రెడ్‌మి 10 ఎక్స్ ప్రోకు మాత్రం కేవలం 5జి వేరియంట్లో లభిస్తుంది. రెండు ఫోన్లు డ్యూయల్ బ్యాండ్ 5జికి సపోర్ట్ ఇస్తాయి. ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.


చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ షియోమీ బ్రాండ్  రెడ్‌మి 10 ఎక్స్ 5జి, రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5జి స్మార్ట్ ఫోన్లను అధికారికంగా చైనాలో ఆవిష్కరించారు. రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోకు ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ  820 SoC పై నడుస్తాయి. ఇందులో 4,520mAh బ్యాటరీని అమర్చారు.రెడ్‌మి 10 ఎక్స్ 5జి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుండగా, రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5జి వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రెండు ఫోన్లు డ్యూయల్ బ్యాండ్ 5జికి సపోర్ట్ ఇస్తాయి. ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

రెడ్‌మి 10 ఎక్స్ సిరీస్ ధర, ఫీచర్లు
రెడ్‌మి 10 ఎక్స్ 5జి చైనాలో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్ సిఎన్‌వై 1,599 (సుమారు రూ .16,900)గా ధరను నిర్ణయించింది. 6జి‌బి ర్యామ్  + 128జి‌బి స్టోరేజ్ మోడల్ ధర సిఎన్‌వై 1,799 (సుమారు రూ. 19,100), 8జి‌బి + 128జి‌బి స్టోరేజ్ ఆప్షన్  ధర సిఎన్‌వై  2,099 (సుమారు రూ. 22,200) వద్ద రిటైల్ అవుతుంది, టాప్-ఎండ్ 8జి‌బి + 256జి‌బి మోడల్ ధర సిఎన్‌వై 2,399 (సుమారు రూ .25,400).

Latest Videos

మరోవైపు, రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5జి ధర 8 జిబి + 256 జిబి మోడల్‌కు సిఎన్‌వై 2,299 (సుమారు రూ .24,800), 8 జిబి + 256 జిబి స్టోరేజ్ ఆప్షన్ ధర సిఎన్‌వై 2,599 (సుమారు రూ .25,500). స్మార్ట్ ఫోన్లు బ్లూ, వైలెట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందింబాటులోకి వస్తున్నాయి. రెడ్‌మి 10 ఎక్స్ జూన్ 1 నుంచి విక్రయించనుండగా, రెడ్‌మి 10 ఎక్స్ ప్రో జూన్ 5 నుంచి అమ్మకాలకు వెళ్తుంది.

రెడ్‌మి 10 ఎక్స్ 4జి మోడల్ ధర 4జిబి + 128జిబి స్టోరేజ్ ఆప్షన్‌కు సిఎన్‌వై 999 (సుమారు రూ .10,500), 6 జిబి + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ కోసం సిఎన్‌వై 1,199 (సుమారు రూ .12,700). ఇది ఇప్పటికే చైనాలో బ్లూ, గ్రీన్ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది.


రెడ్‌మి 10 ఎక్స్ 5జి స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) రెడ్‌మి 10 ఎక్స్ 5జి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఎం‌ఐ‌యూ‌ఐ 12 పై నడుస్తుంది. ఇది 6.57-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) డిస్‌ప్లేను హెచ్‌డి‌ఆర్10,  600నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఇది 7ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్‌తో పాటు మాలి-జి 57 ఎంసి 5 జిపియుతో పనిచేస్తుంది. ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో చేస్తుంది.

ఇమేజింగ్ కోసం రెడ్‌మి 10 ఎక్స్ 5జి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, ఇందులో  ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

also read బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: ‘వర్క్ ఫ్రం హోం’ ప్లాన్ పొడిగింపు

రెడ్‌మి 10 ఎక్స్ 5జిలో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, 4,520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో ఎస్‌ఏ / ఎన్‌ఎస్‌ఏ డ్యూయల్ మోడ్ 5G సపోర్ట్, బ్లూటూత్ వి5.1, ఎన్‌ఎఫ్‌సి, జి‌పి‌ఎస్, 3.5mm ఆడియో జాక్, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, వై-ఫై 802.11 ఏ / బి / జి/ ఎన్ / ఏ‌సి ఉన్నాయి. రెడ్‌మి 10 ఎక్స్ 5 జి డిస్ ప్లే కింద ఫింగర్ ప్రింట్  సెన్సార్‌తో వస్తుంది. దీని బరువు 205 గ్రాములు.

రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5 జి స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5జి కూడా ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఎం‌ఐ‌యూ‌ఐ 12 పై నడుస్తుంది. హెచ్‌డి‌ఆర్ 10,  600నిట్స్ బ్రైట్ నెస్,  6.57-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంది. ఇది 7ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్‌తో పాటు మాలి-జి 57 ఎంసి 5 జిపియుతో కూడి ఉంది. ఫోన్ 8జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది.


ఆప్టిక్స్ విషయానికి వస్తే, రెడ్‌మి 10 ఎక్స్ ప్రో5 జి వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 30ఎక్స్ డిజిటల్ జూమ్‌ సపోర్ట్ తో, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, వెనుక భాగంలో 5 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

4520mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇంటిగ్రేటెడ్ చేసి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో ఎస్‌ఏ  / ఎన్‌ఎస్‌ఏ  డ్యూయల్ మోడ్ 5జి సపోర్ట్, బ్లూటూత్ వి5.1, ఎన్‌ఎఫ్‌సి, జి‌పి‌ఎస్, 3.5ఎం‌ఎం ఆడియో జాక్, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, వై-ఫై 802.11 ఏ / బి / జి/ ఎన్ / ఏ‌సి ఉన్నాయి. రెడ్‌మి 10 ఎక్స్ ప్రో 5 జి డిస్ ప్లే కింద ఫింగర్ ప్రింట్  సెన్సార్‌తో వస్తుంది. ఇది 208 గ్రాముల వద్ద కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది.

click me!