ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘అసుస్’ గ్లోబల్ మార్కెట్లోకి జెన్ ఫోన్ 6ను ఆవిష్కరించింది. త్వరలో భారత్ విపణిలోకి రానున్నది.
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దారు ‘ఆసుస్’ తాజాగా మరో కొత్త స్మా్ర్ట్‌ఫోన్‌ను విపణిలోకి తెచ్చింది. జెన్ ఫోన్ సిరీస్‌లో ‘జెన్‌ఫోన్ 6’ పేరుతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా ఆవిష్కరించింది. స్పెయిన్‌లో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.
అసుస్ జెన్ ఫోన్ 6 త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా రానున్నది. రొటేటింగ్ కెమెరా జెన్‌ఫోన్ 6 స్పెషల్ ఎట్రాక్షన్ అని కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను మనకు అనుగుణంగా ముందుకు, వెనక్కు రొటేట్ చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్,6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ఇలా మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్లో అమర్చారు. ఈ ఫోన్ ధర రూ.39 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో ఫోన్లతోపాటు శామ్ సంగ్ గత నెలలో విడుదల చేసిన గెలాక్సీ ఎ గెలాక్సీ మోడల్ ఫోన్లకు పోటీ కానున్నది అసుస్ జెన్ ఫోన్ 6. ఇందులో జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్ తోపాటు వై-ఫై సౌకర్యం కూడా ఉంది.