డ్యూయల్ డిస్ ప్లే, స్పెషల్ డిజైన్‌తో ఎల్‌జి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Oct 23, 2020, 7:30 PM IST

 ఎల్‌జి బ్రాండ్ నుండి  రాబోయే ఈ మొబైల్ ఫోన్ అక్టోబర్ 28న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఎల్‌జి వింగ్ స్మార్ట్ ఫోన్ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ స్మార్ట్ డిజైన్ కలిగి ఉంది.


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జి 2020లో ప్రత్యేకమైన డిజైన్‌తో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఎల్‌జి బ్రాండ్ నుండి  రాబోయే ఈ మొబైల్ ఫోన్ అక్టోబర్ 28న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

ఎల్‌జి వింగ్ స్మార్ట్ ఫోన్ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ స్మార్ట్ డిజైన్ కలిగి ఉంది. ప్రత్యేకమైన  విషయం ఏంటంటే ఎల్‌జి వింగ్ రెండు  డిస్ ప్లేలతో వస్తుంది, వాటిలో ఒకటి 90 డిగ్రీల వద్ద తిప్పగలిగె స్వివెల్ స్క్రీన్ ఉంది.

Latest Videos

ఈ పవర్ ఫుల్ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్‌తో భారతదేశంలోకి వస్తోంది, ఈ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఏం ఫీచర్స్ ఉన్నాయో  తెలుసుకుందాం.. 

ఇండియాలో ఎల్‌జి వింగ్ ఫోన్ లాంచ్ డేట్ : ఎల్‌జి వింగ్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 28న ఉదయం 11:30 గంటలకు భారత మార్కెట్లో విడుదల కానుంది. కరోనా వైరస్ కారణంగా ఎల్‌జి వింగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

భారతదేశంలో ఎల్‌జి వింగ్ ధర: భారతదేశంలో ఎల్‌జి వింగ్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఫోన్ ధర దక్షిణ కొరియా మార్కెట్లో లాంచ్ చేసిన ఫోన్ ధరకు దగ్గరగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఫోన్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర KRW 1,098,900 (ఇండియాలో సుమారు రూ.71,400). ఫోన్ రెండు కలర్ వేరియంట్లు అరోరా గ్రే, ఇల్యూజన్ స్కై లో వస్తుంది.

also read 

ఎల్‌జి వింగ్ ఫీచర్స్ 

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 10 ఆధారంగా క్యూ ఓఎస్‌లో డ్యూయల్ నానో సిమ్ ఇందులో అందించారు

డిస్ ప్లే: ఫోన్‌లో 6.8-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080 × 2,460 పిక్సెల్‌లు) పి-ఓఎల్‌ఇడి ఫుల్‌విజన్ డిస్ ప్లే ఉంది. 3.9-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080 × 1,240 పిక్సెల్‌లు) జి-ఓఎల్‌ఇడి సెకండరీ డిస్‌ప్లే ఉంటుంది. 

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌, స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం 256 జీబీ వరకు స్టోరేజ్. మైక్రో ఎస్‌డి కార్డు సహాయంతో స్టోరేజ్ 2 టిబి వరకు పెంచే అవకాశం ఉంది.

కెమెరా వివరాలు: ఎల్‌జి వింగ్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.  64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్, 12 మెగాపిక్సెల్స్ మూడవ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, ఫ్రంట్ కెమెరా పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.
 

click me!