నోకియా స్మార్ట్ టీవీ పరిధిని పెంచుతూ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 6 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త నోకియా స్మార్ట్ టివిలు 32 అంగుళాలు, 43 అంగుళాలు (హెచ్‌డి రెడీ, ఫుల్ హెచ్‌డి), 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డి వంటి స్క్రీన్ పరిమాణాల్లో విడుదల చేసినట్లు తెలిపింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ నోకియా స్మార్ట్ టీవీ పరిధిని పెంచుతూ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 6 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త నోకియా స్మార్ట్ టివిలు 32 అంగుళాలు, 43 అంగుళాలు (హెచ్‌డి రెడీ, ఫుల్ హెచ్‌డి), 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డి వంటి స్క్రీన్ పరిమాణాల్లో విడుదల చేసినట్లు తెలిపింది. భారతదేశంలో కొత్త నోకియా స్మార్ట్ టీవీ మోడళ్ల ధర, సేల్ తేదీ, దాని ఫీచర్స్ వివరాలు
ఫీచర్స్: కొత్త రేంజ్ నోకియా స్మార్ట్ టీవీలు ఆడియో అవసరాలను తీర్చడానికి ఫ్లిప్‌కార్ట్ జపనీస్ బ్రాండ్ ఒన్కియోతో చేతులు కలిపింది. నోకియా టీవీ మైక్రో డిమ్మింగ్, మాక్స్ బ్రైట్ డిస్‌ప్లే అత్యుత్తమ ప్రదర్శన అనుభవాన్ని ఇస్తుంది.
అన్ని ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 3 యుఎస్‌బి పోర్ట్‌లు, 2 హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు ఉంటాయి. స్టోరేజ్ గురించి మాట్లాడుతూ 32 అంగుళాల హెచ్‌డి టివి, 43 అంగుళాల పూర్తి హెచ్‌డి టివి మోడళ్లలో 1.5 జిబి ర్యామ్ తో 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు.
43 అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల 4కె మోడళ్లకు 2 జిబి ర్యామ్ తో 16 జిబి స్టోరేజ్ లభిస్తుంది. సౌండ్ అవుట్పుట్ గురించి చెప్పాలంటే 32 అంగుళాలు, 43 అంగుళాల మోడళ్లలో 24 వాట్ల స్పీకర్లు ఉన్నాయి. 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల మోడళ్లలో 48 వాట్ల సౌండ్ స్పీకర్లతో వస్తుంది.
భారతదేశంలో నోకియా స్మార్ట్ టీవీ ధర
నోకియా 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ .12,999 గా నిర్ణయించారు. నోకియా 43 అంగుళాల స్మార్ట్ టీవీ (ఫుల్ హెచ్‌డి) ధర రూ .22,999. నోకియా 43 అంగుళాల 4కె టివి ధర రూ .28,999, నోకియా 50 అంగుళాల 4కె టివి ధర రూ .33,999. 55 అంగుళాల 4కె టీవీని 39,999 రూపాయలకు, 65 అంగుళాల 4కె టీవీని 59,999 రూపాయలకు అందిస్తున్నారు. ఇవన్నీ భారతదేశంలో తయారు చేసిన నోకియా స్మార్ట్ టీవీలు. అక్టోబర్ 15 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.