ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంటారు, మీకు ఎక్కువ బడ్జెట్ లేకపోతే రూ.10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకోండి..
పండుగ సీజన్ రావడంతో మీలో చాలామంది స్నేహితులకి లేదా కుటుంబ సభ్యులకు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంటారు, మీకు ఎక్కువ బడ్జెట్ లేకపోతే రూ.10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకోండి..
మీ సౌలభ్యం కోసం 10 వేల ధర విభాగంలో కొన్ని గొప్ప స్పెసిఫికేషన్లతో వస్తున్న మొబైల్‌ల జాబితాను మీకోసం సిద్ధం చేసాము. ఈ ధరల శ్రేణిలో మీరు ఒప్పో, రియల్‌మీతో పాటు షియోమి, రెడ్‌మి, పోకో బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఒకసారి తెలుసుకుందాం.
రియల్‌మీ సి15
రియల్‌మీ సి15 స్మార్ట్ ఫోన్ 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, ఈ ఫోన్ 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు. ఈ రియల్‌మీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హెలియో జి35 ప్రాసెసర్, స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగపడుతుంది. 6000 mAh బ్యాటరీని ఫోన్‌లో అందించారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ (13MP + 8MP + 2MP + 2MP) ఉండగా, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
also read డ్యూయల్ డిస్ ప్లే, స్పెషల్ డిజైన్‌తో ఎల్‌జి కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ? ...
రెడ్‌మి 9 ప్రైమ్
రెడ్‌మి 9 ప్రైమ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .9,999 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999. ఈ ధర వద్ద అద్భుతమైన స్పెసిఫికేషన్లతో కూడిన మంచి స్మార్ట్ ఫోన్. రెడ్‌మి 9 ప్రైమ్‌లో హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 6.35 అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ హెలియో జి 80 ప్రాసెసర్ ఇందులో ఉంది. 5,020 mAh బ్యాటరీ, ఫోన్ వెనుక వైపు నాలుగు కెమెరాలు 13 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్స్, 5 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
పోకో సి3
పోకో సి3 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 7,499 రూపాయలు. అదే 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు. 6.53 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ హెలియో జి35 చిప్‌సెట్ ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ 13 ఎంపి ప్రైమరీ సెన్సార్, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
రియల్‌మీ నార్జో 20ఏ
రియల్‌మీ నార్జో 20ఎ 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 8,499 రూపాయలు. అదే 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. ఈ రియల్‌మీ మొబైల్ ఫోన్‌లో 6.5 అంగుళాల మినీ డ్రాప్ స్క్రీన్ ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంది. 12ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో చేర్చారు. 5,000 mAh బ్యాటరీ అమర్చారు.