హైపర్ గేమ్ టెక్నాలజీతో ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Oct 6, 2020, 5:26 PM IST

తాజాగా ఇన్ఫినిక్స్ మొబైల్ హాట్ సిరీస్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 10 అని పిలువబడే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. కొన్ని నెలల క్రితం దేశంలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 9కి కొత్త స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్ జెన్ గా నిలుస్తుంది. 


ఇన్ఫినిక్స్ మొబైల్ అనేది షెన్‌జెన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, ఇది 2013లో స్థాపించారు. తాజాగా ఇన్ఫినిక్స్ మొబైల్ హాట్ సిరీస్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 10 అని పిలువబడే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.

కొన్ని నెలల క్రితం దేశంలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 9కి కొత్త స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్ జెన్ గా నిలుస్తుంది. గేమింగ్ కోసం ఉపయోగపడే విధంగా దీంట్లో హైపర్ ఇంజన్ గేమ్ టెక్నాలజీ లభిస్తుంది.

Latest Videos

ఇన్ఫినిక్స్ హాట్ 10 ఫీచర్స్, స్పెసిఫికేషన్లు 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల హెచ్‌డి+ ఐ‌పి‌ఎస్ డిస్ ప్లేతో పిన్-హోల్ తో వస్తుంది. 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫినిష్ తో ఫ్లో షేప్ డిజైన్ ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి 70 ప్రాసెసర్‌తో పాటు 6 జిబి ర్యామ్‌తో అందుబాటులోకి తేస్తుంది. 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్, మెమరీ కార్డ్ ద్వారా 256జి‌బి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా ముందు భాగంలో క్వాడ్ రియర్ కెమెరాలు 16ఎం‌పి, 2ఎం‌పి, 2ఎం‌పి, లో-లైట్ సెన్సార్, ఇన్-డిస్ ప్లే ఫ్రంట్ కెమెరా  అందించారు. ఆటోమాటిక్ ఇంటెలిజన్స్ సామర్థ్యాలు, క్వాడ్-ఎల్ఈడి బ్యాక్ ఫ్లాష్, డ్యూయల్-ఎల్ఇడి ఫ్రంట్ ఫ్లాష్, సూపర్ నైట్ మోడ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కి సపోర్ట్ చేస్తుంది.

also read  గూగుల్ మ్యాప్స్‌లో మీ కార్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

18W ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ మారథాన్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్యాక్ చేసి వస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఎక్స్ ఓఎస్ 7.0 తో వస్తుంది.

 ఇన్ఫినిక్స్ హాట్ 10 డి‌టి‌ఎస్-హెచ్‌డి సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టమ్, బ్యాక్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆటోమాటిక్ ఇంటెలిజన్స్ ఫేస్ అన్‌లాక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఓషన్ వేవ్, అంబర్ రెడ్, అబ్సిడియన్ బ్లాక్, మూన్లైట్ జాడే కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 10 ధర 
ఇన్ఫినిక్స్ హాట్ 10 ధర రూ. 9,999, అక్టోబర్ 16 న మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆన్‌లైన్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

click me!