అద్భుతమైన క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేతో షియోమి కొత్త 4కే టివి లాంచ్.. ధర, ఫీచర్స్ తేలుసా ?

By S Ashok Kumar  |  First Published Dec 8, 2020, 5:55 PM IST

క్వాంటం లీప్స్ అహెడ్ అనే ట్యాగ్‌లైన్‌తో షియోమి రాబోయే టీవీ టీజర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. షియోమి ఈ టీవీ పేరు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.


షియోమి కొత్త 4కే క్యూఎల్‌ఇడి టివిని డిసెంబర్ 16న భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. క్వాంటం లీప్స్ అహెడ్ అనే ట్యాగ్‌లైన్‌తో షియోమి రాబోయే టీవీ టీజర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. షియోమి ఈ టీవీ పేరు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఈ టీవీని ఎం‌ఐ టీవీ 5 ప్రోగా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ టీవీని గత ఏడాది చైనాలో క్వాంటం డాట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో లాంచ్ చేశారు.  మరో మాటలో చెప్పాలంటే, ఎల్‌ఈడీ డిస్‌ప్లేను క్యూఎల్‌ఈడీతో భర్తీ చేయనుంది. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు మంచి ప్రదర్శనతో మంచి ప్రకాశాన్ని పొందుతారు. మొత్తంమీద, క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేతో మీరు ఎల్‌ఈడీ కంటే మెరుగైన డిస్‌ప్లే అనుభూతిని, పనితీరును అందిస్తుంది.

Latest Videos

షియోమి రాబోయే క్యూఎల్‌ఇడి టివి శామ్‌సంగ్, వన్‌ప్లస్, టిసిఎల్ వంటి సంస్థల టీవీలతో పోటీ పడనుంది. భారతీయ మార్కెట్లో టిసిఎల్ 55 సి 715 క్యూఎల్‌ఇడి టివి టివి ధర రూ .55,990. 

also read ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బోనంజా సేల్ : మొబైల్స్ పై డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు ఇంకా మరెన్నో.. ...

 

Mi Fans, an all new TV experience awaits.

December 16th,12 Noon
Stay Tuned. pic.twitter.com/RUtB0PGUaj

— Mi India #Mi10TSeries5G (@XiaomiIndia)

ఎం‌ఐ టివి 5 ప్రో ధర, ఫీచర్లు

ఎం‌ఐ టివి 5 ప్రో గత ఏడాది చైనాలో 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల సైజ్ లో ప్రారంభించింది. చైనాలో ఎం‌ఐ  టివి 5 ప్రో ప్రారంభ ధర 3,699 చైనీస్ యువాన్ అంటే ఇండియాలో 41,700 రూపాయలు.

భారతదేశంలో ఎం‌ఐ టీవీ 5 ప్రో 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఎం‌ఐ టీవీ 5 ప్రోకి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.  ఎం‌ఐ  టీవీ 5 ప్రో మొదట నవంబర్ 2019 లో చైనాలో ప్రారంభించింది.

అన్ని సైజులో అల్ట్రా-హెచ్‌డి (3840x2160- పిక్సెల్) క్యూఎల్‌ఇడి స్క్రీన్లు ఉన్నాయి. ఇది భారతదేశంలో షియోమి లాంచ్ చేసిన అత్యంత ప్రీమియం టెలివిజన్ అవుతుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన టీవీ సిరీస్ అయిన ఎం‌ఐ టివి 4 ఎక్స్ సిరీస్ కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
  

click me!