ఈ స్మార్ట్ బ్యాండ్ సాధారణ స్మార్ట్ వాచ్ లాగా కాకుండా చాలా స్లిమ్ గా ఉంటుంది. హానర్ బ్యాండ్ 6 టచ్ సపోర్ట్‌తో 1.47-అంగుళాల కలర్ డిస్ప్లేతో వస్తుంది. మూడు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ హానర్ సంస్థ తాజాగా హానర్ బ్యాండ్ 6ను చైనాలో ప్రారంభించింది. ఈ స్మార్ట్ బ్యాండ్ సాధారణ స్మార్ట్ వాచ్ లాగా కాకుండా చాలా స్లిమ్ గా ఉంటుంది. హానర్ బ్యాండ్ 6 టచ్ సపోర్ట్‌తో 1.47-అంగుళాల కలర్ డిస్ప్లేతో వస్తుంది.
మూడు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. అంతేకాకుండా దీనిలో 10 స్పోర్ట్స్ మోడ్‌ల ట్రాకింగ్, వుమెన్ హెల్త్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. హానర్ బ్యాండ్ 6 సుమారు 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
హానర్ బ్యాండ్ 6 ధర
హానర్ బ్యాండ్ 6 స్టాండర్డ్ వేరియంట్‌కు ధర సుమారు ఇండియాలో రూ. 2,800. ఎన్‌ఎఫ్‌సి వేరియంట్ ధర ఇండియాలో సుమారు రూ .3,300. ఇది ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. నవంబర్ 11 నుండి విక్రయిస్తుంది.
also read
కోరల్ పౌడర్, మెటోరైట్ బ్లాక్, సీగల్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుందిస్తున్నారు. ప్రస్తుతానికి హానర్ బ్యాండ్ 6 భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో సమాచారం లేదు.
హానర్ బ్యాండ్ 6 ఫీచర్లు
హానర్ బ్యాండ్ 6లో 1.47 అంగుళాల కలర్ డిస్‌ప్లే 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో వస్తుంది. 100 కంటే ఎక్కువగా డయల్ ఫెసెస్ అందిస్తుంది. హానర్ బ్యాండ్ 6 సాధారణ వాడకంతో 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 180 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఇచ్చారు. అధిక వాడకం పై కూడా 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
ఈ స్మార్ట్ బ్యాండ్ కేవలం ఐదు నిమిషాల ఛార్జీతో రెండు రోజులు వరకు పనిచేస్తుంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టంట్ ఉంది. ఇందులో స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ సెన్సార్, వుమెన్ హెల్త్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. రన్నింగ్, ట్రెడ్‌మిల్, సైక్లింగ్, స్విమ్మింగ్ తో పాటు 10 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఆటోమేటిక్ యాక్టివిటీ ట్రాకింగ్ కూడా ఉంది.