గాడ్జెట్స్ ప్రేమికులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఐఫోన్

By Sandra Ashok Kumar  |  First Published Jan 23, 2020, 10:21 AM IST

బడ్జెట్​ ఫోన్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రముఖ లగ్జరీ గాడ్జెట్ల తయారీ సంస్థ ఆపిల్ సిద్ధమవుతోంది. అందుకోసం దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించనున్దని. బడ్జెట్​లో లభిస్తున్న ఆండ్రాయిడ్​ ఫోన్లకు పోటీగా ఈ ఏడాది మార్చిలో తక్కువ ధరలో ఆపిల్ నుంచి​ ఐఫోన్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం.


న్యూఢిల్లీ: ఐ ఫోన్‌ ప్రేమికులకు శుభవార్త.. బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌.. అసలు ఈ మాటే...వినియోగదారులకు వీనుల విందైన మాటల మూట. ఐఫోన్లపై భారతదేశంలో వినియోగదారులకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆపిల్‌ కంపెనీ సన్నద్ధమవుతోంది. తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. 

చౌకధరలో ఒక ఐఫోన్‌ను విడుదల చేయాలని ఆపిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెలలోనే దీని తయారీ చేపట్టాలని, మార్చిలో విపణిలో విడుదల చేయాలన్నది సంస్థ ప్రణాళికగా ఉందని ఆపిల్ సంస్థలో ఐఫోన్ తయారీ వర్గాలు వెల్లడించినట్లు వార్తాసంస్థ బ్లూంబర్గ్‌ తెలిపింది.

Latest Videos

also read పేటెంట్లలో హువావే ఆధిపత్యం.. 5జీ ట్రయల్స్‌లో భారత్ సహా పలు దేశాలు

ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో ఆపిల్ మరింత వాటా చేజిక్కించుకునేందుకు ఈ పరిణామం దోహద పడుతుందని భావిస్తోంది.ఈ కొత్త ఫోన్‌ తయారీ పనులను విభజించనున్నది. తైవాన్‌కు చెందిన హాన్‌హాయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ, పెట్రాన్‌ కార్పొరేషన్‌, విస్ట్రన్‌ కార్పొరేషన్‌లకు అసెంబ్లింగ్ పనులను అప్పగించినట్లు చెబుతున్నారు. 

అటు వినియోగదారులకు ఆకట్టుకోవడంతోపాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తన స్థానాన్ని  మరింత విస్తరించుకోవాలని ఆపిల్‌ భావిస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ తర్వాత ఇది తక్కువ ధర ఐఫోన్‌గా పేర్కొంటున్నారు.2017లో ఆవిష్కరించిన ఐఫోన్‌ 8 తరహాలో 4.7 అంగుళాల తెరతో ఈ ఫోన్‌ ఉంటుందని సమాచారం. త్వరలో విపణిలోకి రానున్న ఐఫోన్ 4.7అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండనుందని సమాచారం. 

also read విపణిలోకి శామ్ సంగ్ ‘నోట్ 10

అలాగే ఆండ్రాయిడ్‌ ఫోన్ల మాదిరే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ అమర్చనుంది. హోమ్‌ బటన్‌లో టచ్‌ ఐడీ ఉంటుందని, ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానం ఉండబోదని అంటున్నారు. అధునాతన ఫీచర్లు గల ఆండ్రాయిడ్‌ ఫోన్లు 200 డాలర్ల (సుమారు రూ.14,000) లోపే లభిస్తుండగా, ఈ ఐఫోన్‌తో ఆపిల్‌ కూడా భారత్‌లో వాటా పెంచుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో 5జీ స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ ఆవిష్కరించనుంది.

2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్‌ ప్రొసెసర్‌, 3డీ బ్యాక్‌ కెమెరా లాంటి ఫీచర్లతో హైఎండ్‌ ఐ ఫోన్‌లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అలాగే 2020 లో 200 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఆపిల్‌. ఈ లక్ష్య సాధనలో రానున్న లోబడ్జెట్‌ ఐఫోన్‌ ముఖ్యమైన పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీని ధరపై ఎలాంటి అంచనాలు లేవు. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు.

click me!