ISL 2021: ‘హ్యాట్రిక్’ కొట్టిన బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ... ఒకటి విజయాల్లో, మరోటి...

By team telugu  |  First Published Jan 6, 2021, 12:37 PM IST

వరుస మూడు మ్యాచుల్లో గెలిచి టాప్‌ ప్లేస్‌కి దూసుకెళ్లిన ముంబై సిటీ...

వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన బెంగళూరు ఎఫ్‌సీ...


ఇండియన్ సూపర్ లీగ్ 2021లో ఒకే రోజు డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. అయితే గోల్స్ విషయంలో కాదు, విజయాలు, పరాజయాల్లో. బెంగళూరు ఎఫ్‌సీని 3-1 తేడాతో ఓడించిన ముంబై సిటీ హ్యాట్రిక్ విజయాలను అందుకోగా, బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్న ముంబై సిటీ, టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఆట ప్రారంభమైన 9వ నిమిషంలోనే గోల్ చేసిన ముంబై సిటీ ప్లేయర్ మౌర్తదా.. జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 15వ నిమిషంలో బిపిన్ సింగ్ మరో గోల్ చేయడంతో ముంబై సిటీ ఆధిక్యం 2-0 కి దూసుకెళ్లింది. ఎట్టకేలకు బెంగళూరు ఎఫ్‌సీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, ఆట 79వ నిమిషంలో గోల్ చేయడంతో 2-1 తేడాతో ముంబై ఆధిక్యాన్ని తగ్గించగలిగింది బెంగళూరు. 
అయితే ఆట 85వ నిమిషంలో గోల్ చేసిన ముంబై ప్లేయర్ బర్తలోమే... తన జట్టుకి తిరుగులేని ఆధిక్యాన్ని, విజయాన్ని అందించాడు. బెంగళూరు ఎఫ్‌సీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.

click me!