ISL 2020: హైదరాబాద్ ఎఫ్‌సీకి రెండో విజయం... టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్..

By team telugu  |  First Published Dec 15, 2020, 10:07 PM IST

రెండు గోల్స్ చేసిన ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ మగోమా...

హైదరాబాద్ తరుపున రెండు గోల్స్ సాధించిన సంటానా...

3-2 తేడాతో విజయాన్ని అందుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ... 


ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్‌లో మూడు డ్రాల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది హైదరాబాద్ ఎఫ్‌సీ. ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్. ఆట ప్రారంభమైన 26వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ మగోమా తొలి గోల్ చేసి, తన జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు.

మొదటి సగం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ ప్లేయర్లు గోల్ చేయలేకపోయారు. అయితే రెండో సగం ఆరంభమైన తర్వాత ఆట 56వ నిమిషంలో వరుసగా రెండు గోల్స్ చేసి హైదరాబాద్‌కి ఆధిక్యాన్ని అందించాడు సంటానా.

Latest Videos

undefined

68వ నిమిషంలో నర్జరీ మరో గోల్ చేయడంతో 3-1 తేడాతో మంచి లీడ్ సాధించింది హైదరాబాద్. అయితే ఆట 81వ నిమిషంలో మగోమా రెండో గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కి తగ్గించాడు.

ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్ చేసే అవకాశం వచ్చినా, హైదరాబాద్ ప్లేయర్లు దాన్ని మిస్ చేశారు. ఈ విజయంతో హైదరాబాద్ ఎఫ్‌సీ టాప్ 5 ప్లేస్‌లోకి చేరగా, ఐదింట్లో నాలుగు మ్యాచులు, ఓ డ్రా మాత్రమే చేసిన ఎస్‌సీ ఈస్ట్ బెంగాళ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

click me!