FIFA: అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత..? వివరాలివిగో..

By Srinivas MFirst Published Dec 19, 2022, 1:02 PM IST
Highlights

FIFA World Cup 2022: నెల రోజులుగా  ఫుట్‌బాల్ ప్రేక్షకులను అలరిస్తున్న  ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం ఫైనల్ లో అర్జెంటీనా - ఫ్రాన్స్ ల మధ్య ముగిసిన తుదిపోరులో  లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. 

గత నెల 20న మొదలైన  ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమరం ఆదివారం  రాత్రి  అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ముగిసిన ఫైనల్ పోరుతో  ముగిసింది.  గత టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ను పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడించిన  అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. ఫ్రాన్స్ రన్నరప్ తో సంతోషపడింది.   ఈ నేపథ్యంలో ఈ టీమ్ లు దక్కించుకున్న   ప్రైజ్ మనీ ఎంత..?  మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు దక్కినదెంత..?  ఈ వివరాలు ఇక్కడ చూద్దాం. 

2018 కంటే ఈసారి ప్రైజ్ మనీని పెంచిన ఫిఫా.. ఖతర్  వేదికగా ముగిసిన వరల్డ్ కప్ లో మొత్తం ప్రైజ్ మనీని  440 మిలియన్ డాలర్లు గా నిర్ణయించింది. అంటే మన భారతీయ  విలువలో  రూ. 3,600 కోట్లు.  ఇందులో  ఫైనల్ లో గెలిచిన విజేత, పరాజితలతో పాటు సెమీస్, క్వార్టర్స్, ప్రి క్వార్టర్స్, లీగ్ దశలో  పాల్గొన్న జట్లకు  మొత్తం పంచారు.  

 

FIFA World Cup 2022 Prize Money:

Winner – 344 cr
Runner Up- 245 Cr
3rd Place – 220 cr
4th place – 204 cr
5th - 8thplace – 138 cr
9th - 16th place – 106 cr
17th -32nd place – 74 cr pic.twitter.com/lZDLsIfWkg

— Siva Sankar naidu pathipati (@sankar_sinny18)

వివిరాలివే... 

- ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన అర్జెంటీనాకు దక్కిన మొత్తం  42 మిలియన్ డాలర్లు.. (భారత కరెన్సీ లో రూ. 344 కోట్లు)
- రన్నరప్ ఫ్రాన్స్ కు  30 మిలియన్ డాలర్లు (రూ. 245 కోట్లు) 
- మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా కు  27 మిలియన్ డాలర్లు (రూ. 220 కోట్లు) 
- నాలుగో స్థానంలో ఉన్న మొరాకోకు  25 మిలియన్ డాలర్లు (రూ. 204 కోట్లు) 
- క్వార్టర్స్ లో ఓడిన  ఒక్కో జట్టుకు.. రూ. 140 కోట్లు 
- ప్రి క్వార్టర్స్ టీమ్‌లకు.. రూ. 106 కోట్లు
- లీగ్ దశలో  నిష్క్రమించిన జట్లకు.. రూ. 74 కోట్లు 

అవార్డుల జాబితా : 

- గోల్డెన్ బూట్ అవార్డ్ : కైలియన్ ఎంబపే (ఫ్రాన్స్) 
- గోల్డెన్ బాల్ అవార్డ్ : లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) 
- గోల్డెన్ గ్లోవ్ అవార్డ్ : ఎమిలియానో మార్టినెజ్ (అర్జెంటీనా) 
- ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డ్ : ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)  
- మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ : లియోనల్ మెస్సీ 
- ఫెయిర్ ప్లే అవార్డు : ఇంగ్లాండ్ 

 

In the 2018 World Cup, the prize money for the winner was $38 million or Rs 314 crore. Prior to the 2010 World Cup, the winnings were considerably lesser
The Evolution Of FIFA World Cup Prize Money pic.twitter.com/ji0JfFbNbB

— bemoneyaware (@bemoneyaware)
click me!