FIFA: ప్రెస్ మీట్‌కు రాలేదని జరిమానా.. జర్మనీకి షాకిచ్చిన పిఫా

By Srinivas MFirst Published Nov 30, 2022, 7:00 PM IST
Highlights

FIFA World Cup 2022:  ఫిఫా ప్రపంచకప్ లో  ఆటను ఎంతమంది చూసి ఆస్వాదిస్తున్నారో  గానీ   కావాలిసినన్ని కాంట్రవర్సీలు నమోదవుతున్నాయి.  రోజూ వివాదాలు, నిరసనలతో ఫిఫా  వర్ధిల్లుతున్నది. 

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో మరో వివాదం.   ప్రెస్ మీట్ కు రాలేదనే కారణంతో  జర్మనీ జట్టుకు  ఫిఫా నిర్వాహకులు షాకిచ్చారు.  స్పెయిన్ తో మ్యాచ్  కు ముందు   జర్మనీ చేసిన ఈ పని ఫిఫాకు  ఆగ్రహం తెప్పించింది.   దీంతో నిబంధలను ఉల్లంఘించిన  కారణంగా  జర్మనీపై  పదివేల స్విస్ ఫ్రాన్సెస్ (సుమారు రూ. 8.5 లక్షల జరిమానా విధించింది. 

గ్రూప్ - ఈలో ఉన్న  జర్మనీ.. ఈ నెల 28న  స్పెయిన్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు జర్మనీ నుంచి ఒక్కరూ రాలేదు. ఆ జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్,  మేనేజర్, కోచింగ్ సిబ్బంది  ఎవరూ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదు. దీంతో ఫిఫా జరిమానా విధించింది. 

అయితే జర్మనీ హెడ్ కోచ్ హన్సి ఫ్లిక్  మాత్రం తాను మ్యాచ్ మీద ఫోకస్ పెట్టామని, అందుకే ప్లేయర్లందరూ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారని తెలిపాడు. అయితే  తుది జట్టు ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేసుకున్నా ఎవరినో ఒకరిని పంపించి ఉంటే అయిపోయేదని, సుమారు 25 మంది ఆటగాళ్లు,  కోచింగ్ సిబ్బంది, మేనేజర్లు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఖాళీగా లేరా..? అని ఫిఫా వారిని ప్రశ్నించింది. 

 

🇩🇪Germany have been fined £8,700 for refusing to bring a player to their pre-match press conference against Spain.

The decision makes them the first team to be fined by FIFA during the Qatar World Cup. pic.twitter.com/7qGUwKPr6w

— Sam Street (@samstreetwrites)

ఇక ఈ టోర్నీలో  గ్రూప్ - ఈ లో ఉన్న  జర్మనీ  రెండు మ్యాచ్ లు ఆడింది. తమ తొలి మ్యాచ్ లో జపాన్ చేతిలో ఓడిన జర్మనీ.. రెండో మ్యాచ్ లో  స్పెయిన్ తో డ్రా చేసుకుంది. డిసెంబర్ 2న ఆ జట్టు  కోస్టారికాతో  గ్రూప్ చివరి మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ - 16 చేరాలంటే  జర్మనీకి  ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న జర్మనీ రెండో రౌండ్ కు  చేరుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు ఆ దేశ అభిమానులకు టెన్షన్ గా మారింది.   

ఇదివరకే రౌండ్ - 16 చేరిన జట్లు : 

- ఫ్రాన్స్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, సెనగల్, ఇంగ్లాండ్, యూఎస్ఎ  

 

If your team is on this graphic, go ahead and breathe a sigh of relief 🤩

On to the Round of 16! pic.twitter.com/QH9kzShXfn

— FOX Soccer (@FOXSoccer)

అధికారికంగా ఎలిమినేట్ అయిన జట్లు : 

- ఈక్వెడార్, ఖతర్, ఇరాన్, వేల్స్, కెనడా 

click me!