ఇటలీలో కఠినంగా అమలులో ఉన్న కరోనా ఆంక్షలు...
150 కిలో మీటర్లు ప్రయాణించి కౌర్మయుర్‌కి చేరుకున్న రొనాల్డో, రొడ్రిగ్స్...
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి, వెంటనే తొలగించిన రొడ్రిగ్స్...
లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చిక్కుల్లో పడ్డాడు. తన ప్రేయసి జార్జీనా రోడ్రిగ్స్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం కరోనా నిబంధనలను అతిక్రమించి, మౌంటెన్ రిసార్ట్‌కి వెళ్లాడు రొనాల్డో. ప్రస్తుతం ఇటలీలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్నాయి.
టురిన్ నగరంలో ఉంటున్న రొనాల్డో, రోడ్రిగ్స్... సిటీని వదిలి బయటికి వెళ్లడానికి వీల్లేదు. అయితే గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని భావించాలని రొనాల్డో... ఆమెతో కలిసి మంచులో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. దాదాపు 150 కిలో మీటర్లు ప్రయాణించి కౌర్మయుర్‌కి చేరుకున్నారు.
అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రోడ్రిగ్స్, కొద్దిసేపటికే వాటిని తొలగించింది. అయితే చాలా వెబ్‌సైట్లలో ఈ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. రొనాల్డో కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే.