ఫ్యాక్ట్ చెక్: బడ్వైజర్ బీరులో మూత్రం, నిజమెంత..?

By Sreeharsha GopaganiFirst Published Jul 2, 2020, 5:29 PM IST
Highlights

బడ్వైజర్ బీర్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి గత 12 సంవత్సరాలుగా బీర్ తాయారు చేసే కంటైనర్ లలో మూత్ర విసర్జ చేసినట్టు ఒప్పుకున్నాడు అని ఒక వార్త షికార్లు చేస్తుంది. 

నేటి ఉదయం నుండి బడ్వైజర్ బీర్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి గత 12 సంవత్సరాలుగా బీర్ తాయారు చేసే కంటైనర్ లలో మూత్ర విసర్జ చేసినట్టు ఒప్పుకున్నాడు అని ఒక వార్త షికార్లు చేస్తుంది. 

వార్త కథనం ప్రకారం వాల్టర్ పావెల్(పేరు మార్చడం జరిగింది) అనే ఉద్యోగి బడ్వైజర్ బీర్ కంపెనీలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, అతడు ఆ కాలమంతా బడ్వైజర్ బీర్ ట్యాంకుల్లో మూత్ర విసర్జన రోజు చేసేవాడని ఒప్పుకున్నట్టుగా ఆ వార్త కథనంలో పేర్కొన్నారు. 

తన మిత్రులు ఎప్పుడైనా బడ్వైజర్ కావాలి అని అడిగినప్పుడు తనలో తానే నవ్వుకునేవాడినని వాల్తేర్ పేర్కొన్నట్టు కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరిన రెండు  అధికారుల నమ్మకాన్ని సంపాదించిన తరువాత  వాష్ రూమ్ దూరంగా ఉండడంతో, బద్దకంతో ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చాడని, ఇకమీదట తాను అలా చేయనని, బడ్వైజర్ అసలైన రుచిని ఆస్వాదించవచ్చని తెలిపినట్టు ఆ కథనంలో రాసుకొచ్చారు. 

ఈ వార్త కథనం ప్రచురితమైన దగ్గరి నుండి సోషల్ మీడియా అంతా ఇవే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బడ్వైజర్ అనే హాష్ టాగ్ ఉదయం నుండి ట్రెండ్ అవుతుంది. నెటిజన్స్ అంతా తమ క్రియేటివిటీకి పదును పెడుతూ రకరకాల మీమ్స్ షేర్ చేస్తున్నారు. 

అయితే ఈ వార్తను ప్రచురించింది ఫ్యూలిష్ హ్యూమర్ అనే ఒక ఫిక్షన్ కథనాలు ప్రచురించే ఒక సంస్థ. వారు తమ వెబ్ సైట్లోనే ఇవన్నీ ఫిక్షన్ ఆధారంగా ప్రచురించేవి అని క్లియర్ గా పేర్కొంటారు. సో ఇదొక ఫేక్ వార్త. బడ్వైజర్ బీర్ తాగినోళ్ళు ఎవరి మూత్రము తాగలేదు. 

click me!