యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు.
ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా లేదా.. అనే ఉహాగానాలకు తెరదించుతూ ప్రోమో కూడా వచ్చేసింది. అలాగే నాగార్జునతో కూడిన బిగ్ బాస్ ప్రోమోల షూట్ కూడా ప్రారంభమైంది. వరుసగా బిగ్ బాస్ సీజన్ 5కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. లేటెస్ట్ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ పై అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రచారంలో ఉన్న సెలెబ్రిటీలలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది.
జబర్దస్త్ నుండి గత సీజన్లో ముక్కు అవినాష్ పాల్గొన్నారు. ఈ సారి ఖచ్చితంగా ఒకరిద్దరు బిగ్ బాస్ కమెడియన్స్ పాల్గొనే అవకాశం కలదు. ఆ విషయం అటుంచితే.. మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని వెండితెరపై వెలిగిపోవాలని లహరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ ప్రారంభం కానుంది. గత నాలుగు సీజన్స్ భారీ రెస్పాన్స్ దక్కించుకోగా లేటెస్ట్ సీజన్ మరింత కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. కంటెస్టెంట్స్ కూడా బాగా తెలిసిన సెలెబ్రిటీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి. అలాగే హౌస్ లోకి ఎక్కువ శాతం అమ్మాయిలు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పోటీ నేపథ్యంలో గ్లామర్ డోస్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారట.