జీ తెలుగు అభిమానులలో మానసిక స్థైర్యాన్ని పెంచడం కోసం డాక్టర్ కళ్యాణ్ తో కలిసి ఫేస్బుక్ లైవ్!

By team teluguFirst Published May 21, 2021, 1:42 PM IST
Highlights

మీ మానసిక దైర్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారా ఐతే 21 మే నుండి 27 మే వరకు సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు ఫేస్బుక్ లైవ్ మిస్ అవకండి.


జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని అందరికి తెలుసు. ఎప్పుడు అందరిని నవ్విస్తూ , ప్రేరేపిస్తూ ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఉన్న కష్ట కాలంలో తన అభిమానులకు తోడుగా నిలవాలని బతుకు జట్కా బండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎం బి బి ఎస్ , ఎం డి (సైకియాట్రీ) ఎం ఆర్ సి (లండన్) సీనియర్ కన్సల్టెంట్ సైక్రియాట్రిస్టు మరియు రిలేషన్షిప్ కౌన్సిలర్ తో కలిసి కోవిడ్ సమయంలో ఏ విధంగా మానసికంగా స్థిరంగా ఉండాలి అనే దాని గురించి 21 మే సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు ఫేస్బుక్ పేజీలో ఆయన లైవ్ కి వస్తారు, అదే విధంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెపుతారు.

 డాక్టర్ కళ్యాణ్ అందరికి సుపరిచితులు. మన ‘బతుకు జట్కా బండి’ షో ద్వారా ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసారు. అదే విధంగా మే 21 నుండి 27 వరకు ఆయన ఫేస్బుక్ లైవ్ ద్వారా నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి, ఇంటి నుండి పని చేయడం వల్ల ఎదురయ్యే ఒత్తిడి, ఉత్పాదకత ఆందోళన మరియు క్లాస్ట్రోఫోబియా అను విషయాల మీద చర్చిస్తారు అలాగే ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పడం జరుగుతుంది.

మీ మానసిక దైర్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారా ఐతే 21 మే నుండి 27 మే వరకు సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు ఫేస్బుక్ లైవ్ మిస్ అవకండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

click me!