మాయమాటలతో రూ. 26కోట్లు నొక్కేసిన మ్యూజిక్ డైరెక్టర్... చివరికి కటకటాలపాలు!

By team teluguFirst Published Mar 17, 2021, 7:50 AM IST
Highlights

సంగీత దర్శకుడు అమ్రేష్‌ను తన వద్ద రూ. 26కోట్ల రూపాయలు మోసం చేసి వసూలు చేసినట్లు ఓ వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ భారీ మోసానికి సంబంధించిన విషయాలను చెన్నై పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. 

సాంకేతికంగా సమాజం ఎంత అభివృద్ధి చెందినా.. అత్యాశ, మూఢ నమ్మకాలు మనుషులు మోసపోయేలా చేస్తున్నాయి. మనుషులలో ఉండే వీక్నెస్ ని తమకు తమకు అనుకూలంగా మార్చుకొని కేటుగాళ్ళు కోట్లు నొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సంగీత దర్శకుడు రైస్ ఫుల్లింగ్ పేరుతో కోట్ల రూపాయలు కొట్టేశాడు. 
 

సంగీత దర్శకుడు అమ్రేష్‌ను తన వద్ద రూ. 26కోట్ల రూపాయలు మోసం చేసి వసూలు చేసినట్లు ఓ వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ భారీ మోసానికి సంబంధించిన విషయాలను చెన్నై పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. మహిమలు కలిగిన ఇరిడియం(రైస్‌ పుల్లింగ్‌) తన వద్ద ఉందని, దానికి బయట మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని  కోట్ల లాభం గడించవచ్చని చెప్పి తన వద్ద రూ.26 కోట్లు తీసుకుని అమ్రేష్, బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేసినట్లు వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

దీంతో అమ్రేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న మంగళవారం అతన్ని అరెస్ట్‌ చేసి ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు. కోలీవుడ్ కి చెందిన యువ సంగీత దర్శకుడు ఇంత పెద్ద మోసానికి పాల్పడడం సంచలనంగా మారింది. 


 

click me!