ప్రమోషన్స్ డోస్ పెంచిన 'యాత్ర'

Published : Jan 28, 2019, 05:56 PM ISTUpdated : Jan 28, 2019, 06:08 PM IST
ప్రమోషన్స్ డోస్ పెంచిన 'యాత్ర'

సారాంశం

వైయస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8 న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధం అవుతుండటంతో వైయస్ఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. 

వైయస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8 న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధం అవుతుండటంతో వైయస్ఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

 

చిత్రసీమలో బయోపిక్ ల హవా నడుస్తుండటంతో అందులోను ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వైయస్ఆర్ జీవితం ఆధారంగా చిత్రం రూపొందటంతో సగటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. పైగా ఎన్టీఆర్ మహానాయకుడు రెండవ భాగం కూడా అప్పుడే విడుదల అవటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

 

ఇదిలా ఉండగా మహానేత వైయస్ఆర్ మీద అభిమానం  చాటుకుంటున్నారు అమ్మాయిలు.  యాత్ర చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. సంక్షేమ పథకాలతో పెద్దవారి నుంచి యువత వరకు అందరి గుండెల్లో నిలిచిన మహానేత. వైయస్ రాజశేఖర రెడ్డి గారి  పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర సినిమాకి మద్దతుగా వైయస్ఆర్ లాగా అభివాదం చేస్తూ..  #YatraYSRBranding పేరుతో యూనిట్ సందడి చేస్తుంది. పలు చోట్ల యాత్ర చిత్రానికి సంబంధించి ప్రచారం చేస్తూ సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫిబ్రవరి 8 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

13 కోట్ల వాచ్, 60 ఏళ్ల వయసులో 7300 కోట్ల ఆస్తి, ఇండియాలోనే రిచ్ హీరో ఎవరో తెలుసా?
Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?