ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. హీరోయిన్ కామెంట్స్!

Published : Oct 03, 2019, 10:45 AM ISTUpdated : Oct 03, 2019, 12:35 PM IST
ఆ సినిమాలో నటించి తప్పు చేశా.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ చాలానే ఉంటాయి. అటువంటి సన్నివేశాల్లో యాషికా నటించింది. అయితే ఈ సినిమా తరువాత కూడా ఆమెకి అలాంటి సినిమాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. 

నటి యాషికా బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించుకుంది. గతంలో ఈ భామ 'ఇరుట్టు అరైయుల్ మురట్టు కుత్తు' అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో నటించడంపై ఆమె ఇప్పటికీ బాధ పడుతూనే ఉంటుందట. అడల్ట్ కామెడీ నేపధ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో యాషికా ప్రధాన పాత్ర పోషించింది.

ఇదే సినిమాను తెలుగులో 'చీకటిగదిలో చితక్కొట్టుడు' అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ చాలానే ఉంటాయి. అటువంటి సన్నివేశాల్లో యాషికా నటించింది. అయితే ఈ సినిమా తరువాత కూడా ఆమెకి అలాంటి సినిమాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. 

దీనిపై స్పందించిన ఆమె.. సినిమాలో నటించిన మాదిరిగానే నిజ జీవితంలో ఉండరనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని చెప్పింది. నటించిన పాత్ర వేరు, వ్యక్తిగత జీవితం వేరని చెప్పింది.

'ఇరుట్టు అరైయుల్ మురట్టు కుత్తు' సినిమాలో నటించి తప్పు చేశానని.. ఇప్పటికీ ఆ సినిమా విషయంలో బాధ పడుతున్నానని చెప్పింది. ఇకపై అలాంటి సినిమాల్లో నటించనని.. నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలో మాత్రమే నటిస్తానని చెప్పుకొచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో