
టాక్సిక్ మూవీ షూటింగ్ నుంచి యశ్ వీడియో లీక్
కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సౌత్ స్టార్ హీరో యశ్. ఇక ప్రస్తుతం ఆయన తమిళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ 'టాక్సిక్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుందట గీతూ. ఇక తాజాగా ఈసినిమా సెట్ నుంచి ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అందులో యశ్ బాల్కనీలో షర్ట్ లేకుండా సిగరెట్ తాగుతున్న సీన్ ఉంది. ఈ వీడియో చూసి యశ్ అభిమానులు కంగారుపడుతున్నారు.
కేజీఎఫ్ 2 తర్వాత, యశ్ కొంత గ్యాప్ తీసుకుని, తన సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. 'టాక్సిక్' కోసం చాలా కష్టపడుతున్నాడు యశ్. ఈమూవీలో డిఫరెంట్ గెటప్ తో పాటు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చేస్తున్నాడు. అందుకోసం తన లుక్ ను కాస్త సీక్రేట్ గా మెయింటేన్ చేస్తున్నాడు యశ్. దాంతో అనుకోకుండా యశ్ వీడియో లీక్ అవ్వడం, సినిమా టీమ్ ను కాస్త కంగారు పెట్టింది. ఈ వీడియోలో యష్ సీక్స్ ప్యాక్ తో సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఈమూవీలో ఆయన లుక్ ఎంత రఫ్ అండ్ రగ్డ్ గా ఉంటుుందో ఆడియన్స్ కు అర్ధం అయ్యింది. ఇక యశ్ అభిమానులయితే ఈమూవీ ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
యశ్ విడియోపై రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక అభిమాని, " ఆ స్టైల్ చూడండి" అని రాయగా, ఇంకో అభిమాని, "రాఖీ భాయ్ స్టైల్ చాలా స్పెషల్ అని రాశాడు. ఇంకో అభిమాని, "యశ్ చాలా అందంగా ఉన్నాడు..." అని లవ్ ఎమోజీ సెండ్ చేశాడు.
టాక్సిక్ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది. ఇక కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో కూడా యశ్ కు ఎక్కువగా అభిమానులు ఉన్నారు. ఈసినిమాకోసం వారు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈమూవీని మార్చి 19, 2026న ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక టాక్సిక్ సినిమాలో యశ్‌తో పాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రామాయణంలో రావణుడిగా
యష్ టాక్సిక్ మూవీతో పాటు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రణ్ బీర్, సాయి పల్లవి రాముడు, సీతగా నటిస్తోన్న రామయణం సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం యశ్ భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్టు టాక్. ఇక రామయాణం రెండోవ భాగంలో యష్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండేలా డైరెక్టర్ సినిమాను డిజైన్ చేశారని తెలుస్తోంది.