గ్యాంగ్ స్టర్స్ తో హాల్‌ నిండితేనే మాంస్టర్‌ వేటః `కేజీఎఫ్‌` బిగ్‌ అప్‌డేట్‌

Published : Jul 06, 2021, 05:31 PM IST
గ్యాంగ్ స్టర్స్ తో హాల్‌ నిండితేనే మాంస్టర్‌ వేటః `కేజీఎఫ్‌` బిగ్‌ అప్‌డేట్‌

సారాంశం

`కేజీఎఫ్‌2`చిత్ర విడుదలపై అనేక ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. విడుదలపై క్లారిటీ ఇచ్చింది.త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది.

`కేజీఎఫ్‌` చిత్రం ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఒకటి. `కేజీఎఫ్‌`కి రెండో పార్ట్ గా `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` వస్తోంది. యశ్‌, ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 16న సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌తో వాయిదా పడింది. ఇప్పుడు సినిమా విడుదలపై అనేక ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైతే గ్యాంగ్‌స్టర్స్ తో థియేటర్లు నిండిపోతాయో అప్పుడే మాంస్టర్‌ వేట కొనసాగుతుంది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామ`ని చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో కేజీఎఫ్‌ని మాంస్టర్‌గా, ఆడియెన్స్ ని గ్యాంగ్‌స్టర్స్ గా వర్ణించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. 

యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..
Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఆది సాయికుమార్‌ కి సాలిడ్‌ బ్రేక్‌