
కన్నడ స్టార్ హీరో.. కెజియఫ్ ఫేమ్.. యష్ పుట్టినరోజున బ్యానర్ కడుతుండగా విద్యుత్ తీగ తగిలి కొంతమంది అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టిన రోజున అభిమానుల మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు యష్. ఆ బాధ తట్టుకోలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే.. బర్త్ డే అంటేనే అసహ్యం వేస్తుందన్నారు. అసలు పుట్టిన రోజు జరుపుకోవాలి అంటేనే భయం మేస్తుందని అన్నారు యష్. మరణించిన తన అభిమానుల మురళి, నవీన్, హనుమంత్ కుటుంబాలను యష్ స్వయంగా వెళ్లి పరామర్శించాడు.
ఇక పరామర్శతో ఊరుకోకుండా.. వారి కుటుంబాలకు అండగా ఉంటానని అప్పుడే మాట కూడా ఇచ్చాడు యష్. అంతే కాదు ఇచ్చిన మాటను నిలెట్టుకున్నాడు కన్నడ స్టార్ హీరో. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాడు. అయితే యష్ తరపున ఈ ఆర్ధిక సాయాన్ని. గడగ్ జిల్లా సోరంగి గ్రామానికి వెళ్లి యష్ స్నేహితులు బాధితుల కుటుంబాలకు అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. యష్ ఇలా తమ కుటుంబాలకు ఆర్ధికంగా ఆదుకోవడంతో.. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి పోవడంతో ఇబ్బందుల్లో పడ్డ కుటుంబ సభ్యులు కొంత కోలుకుని.. ఊరట చెందారు.
ఇక రీసెంట్ గా జరిగిన యష్ పుట్టినరోజు వేడుకల్లో వేడుకల్లో విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన యష్ అభిమానులు జనవరి 7 రాత్రి బర్త్ డే బ్యానర్స్ సొంత ఊరిలో ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్స్ కట్టే క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ కి గురయ్యారు. ఈ విషయంలో యమోషనల్ కామెంట్స్ కూడా చేశారు యష్.