Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!

Published : Apr 15, 2026, 11:46 PM IST
yash starring toxic signed record kerala distribution rights deal with e 4 entertainment

సారాంశం

యష్  నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫార్ గ్రోన్ అప్స్' సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడిందంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని హీరోయిన్ తారా సుతారియా క్లారిటీ ఇచ్చింది. సినిమా అనుకున్న తేదీకే వస్తుందని స్పష్టం చేసింది.

టాక్సిక్ రిలీజ్ వాయిదా పడిందా..?

రాకింగ్ స్టార్ యశ్ నెక్స్ట్ సినిమా 'టాక్సిక్ ఎ ఫేరీ టేల్ ఫార్ గ్రోన్ అప్స్' రిలీజ్ డేట్ గురించి  సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? అసలేం జరిగిందంటే... 

గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారిందని చాలా రిపోర్టులు చెబుతున్నాయి. జూన్ 4, 2026న ఈ సినిమా రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్స్‌కు హీరోయిన్ తారా సుతారియా చెక్ పెట్టింది. ఫరా ఖాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె, సినిమా వాయిదా వార్తలు అబద్ధమని తేల్చి చెప్పింది. '

టాక్సిక్ రిలీజ్ పై యుద్ద ప్రభావం..

టాక్సిక్' కచ్చితంగా జూన్ 4, 2026నే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది. నిజానికి 'టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫార్ గ్రోన్ అప్స్' సినిమాను మొదట మార్చి 19న రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పుడు రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ ది రివెంజ్' సినిమాతో పోటీ పడే అవకాశం ఉండేది. కానీ, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో, మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. 

'టాక్సిక్' టీజర్ రిలీజైనప్పుడు కొన్ని వివాదాలకు దారితీసింది. ఇందులో అశ్లీల, లైంగిక అంశాలు ఉన్నాయని చాలామంది ఆరోపించారు. మహిళా కమిషన్ కూడా సినిమాపై అభ్యంతరం తెలిపింది.

టాక్సిక్ నటీనటులు, బడ్జెట్ వివరాలు

మరోవైపు, తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఫిర్యాదు చేసింది. 'టాక్సిక్' సినిమాలో యష్ హీరోగా నటిస్తుండగా... తారా సుతారియా, కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, కైల్ పాల్, డారెల్ డి-సిల్వాతో కూడిన భారీ తారాగణం ఉంది. రిపోర్టుల ప్రకారం, ఈ సినిమాను దాదాపు రూ. 700-800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?