Rashmika Mandanna : చదివిన స్కూల్, ఆటాడిన ఫ్రెండ్స్, సొంతూరిలో రష్మిక ఎమోషనల్ మూమెంట్స్..

Published : Apr 10, 2026, 02:01 PM IST
Rashmika Mandanna Celebrates 30th Birthday in Coorg with Vijay Deverakonda

సారాంశం

రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజు కోసం సొంతూరు కూర్గ్‌కు వెళ్లింది. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. గురువారం నాడు తన స్పెషల్ పార్టీ ఫోటోలను షేర్ చేస్తూ… ఏమని కామెంట్స్ చేసిందంటే?

పెళ్లి తరువాత మొదటి పుట్టిన రోజు.. 

"పుష్ప" బ్యూటీ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో, భర్త విజయ్ దేవరకొండతో కలిసి తన సొంతూరు కూర్గ్‌కు వెళ్లింది. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది.ఈ జంట రష్మిక సొంతూరుకు వెళ్లారు. అక్కడ రష్మిక తాను చదువుకున్న స్కూల్‌ను బయటి నుంచే చూసి మురిసిపోయింది. చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడిని కూడా సందర్శించింది. అంతేకాదు, ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో జరిగిన తమ పెళ్లికి రాలేకపోయిన దగ్గరి బంధువులను కూడా కలుసుకుంది.

చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుని..

తన 30వ పుట్టినరోజు వేడుకల గురించి రష్మిక ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. "ఈసారి నా 30వ పుట్టినరోజు కాస్త భిన్నంగా గడిచింది. చాలా కాలం తర్వాత ఇంటికి వెళ్లాను. చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడికి వెళ్లాను. సమయం లేకపోవడంతో నా స్కూల్‌ను బయటి నుంచే చూశాను. నా చిన్ననాటి రోజులను ఒక్కసారి గుర్తుచేసుకున్నాను. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణమైన వాళ్ల మధ్య, నా జీవితాంతం నాతో ఉండేవాళ్ల మధ్య కేక్ కట్ చేశాను ," అని రాసుకొచ్చింది.

 

 

 

ప్రతిదీ విలువైనదే అనిపిస్తోంది..

ఆమె ఇంకా కొనసాగిస్తూ, "పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను ఒక చిన్న డిన్నర్ పార్టీలో కలిశాను. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఆశీర్వదిస్తున్న వాళ్లు.. నా స్కూల్ స్నేహితులు, ఈ రోజు నా స్నేహితుల కన్నా ఎక్కువగా నా కుటుంబంలా మారిన వాళ్లను కలిశాను. జీవితంలో ప్రతీది ఒక మంచి కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను. ఇదే ఆ కారణం! ప్రతిదీ విలువైనదే అనిపిస్తోంది! " అని పేర్కొంది.

సినిమాల విషయానికి వస్తే.. 

రష్మిక మందన్న ‌- విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' అనే ఫీచర్ ఫిల్మ్‌లో కనిపించనున్నారు. దీంతో పాటు షాహిద్ కపూర్‌తో 'కాక్‌టెయిల్ 2', రవీంద్ర పుల్లే దర్శకత్వంలో 'మైసా' అనే తెలుగు థ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర