Paruchuri Shocking Look: పరుచూరి వెంకటేశ్వర రావుకి ఏమైంది...? గుర్తు పట్టనంతగా మారిపోయిన స్టార్ రైటర్

Published : Mar 13, 2022, 09:36 AM IST
Paruchuri Shocking Look: పరుచూరి వెంకటేశ్వర రావుకి ఏమైంది...? గుర్తు పట్టనంతగా మారిపోయిన స్టార్ రైటర్

సారాంశం

తెలుగు సినీపరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ తెలియనివారు ఉండరు. తెలుగు సినీ ప్రస్తానంలో వీరిదిప్రత్యేకస్థానం. గత కొద్ద కాలంగా వీరు కనిపించడం లేదు.రీసెంట్ గా పరుచూరి వెంకటేశ్వర రావు ఫోటో ఒకటి బయటకు రాగా.. అంతా షాక్ అయ్యారు. 

తెలుగు ఇండస్ట్రీలోని రచయితలలో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేక స్థానం. వందలాది తెలుగు సినిమాలకు వీరు రచయితగా పనిచేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమాలకు పవర్ ఫుల్ డైలాగ్స్ ను అందించారు పరుచూరి సోదరులు. పరుచూరి పెన్ను పవర్ కు స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరు బ్లాక్ బస్టర్స్ కొట్టారు. చిన్నా పెద్దా హీరోలతో కలిసి పని చేశారు పరుచూరి బ్రదర్స్. 

కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో  రచయితలుగా చక్రం తిప్పిన ఈ అన్నదమ్ములు. చాలా సినిమాల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా కూడా అందరికి సుపరిచితులు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు రచయితగానే కాక.. ఎక్కువగా సినిమాల్లో  క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అందరికి గుర్తుండిపోయారు. అటువంటిది ఆయన గత కొంత కాలంగా స్క్రీన్ మీద కనిపించడం మానేశారు. బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు. 
 
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఆడియన్స్ కు షాక్ కొట్టేలా చేసింది. ఈ ఫోటోలో పరుచూరి గుర్తు పట్టకుండా అయిపోయారు. ఈఫోటో చూసి పరుచూరి అభిమానులు ఆవేధన చెందుతున్నారు. బక్కచిక్కిపోయి.. చర్మ ముడతలు పడిపోయి.. పరుచూరి బాగా మారిపోయారు. అయితే ఆయన  వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారంతో కృంగిపోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు పలు ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ఇలా అయిపోయినట్టు సమాచారం. 

 

ఇక పరుచూరి వెంకటేశ్వర రావు ను  ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇలా శేర్ చేయడం వల్లే పరుచూరి ఇలాఅయిపోయారు అన్నది అందరికి తెలుసింది. ఈ పోస్ట్ పెట్టిన జయంత్ ఈ విధంగా కామెంట్ రాశారు. నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 200 కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి అని ఇన్‌స్టాగ్రామ్‌లో జయంత్  రాసుకొచ్చాడు. 

నిండుగా.. చక్కని ఆకారంతో ఎప్పుడూ నవ్వుతూ.. అందరిని నవ్విస్తూ.. మాటల తూటాలతో.. పంచులు.. ప్రాసలతో ఉండే వారు ఇలా బక్కచిక్కిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు లుక్‌ను చూసిన అభిమానులు గురువుగారు ఏంటండీ ఇది.. ఇలా అయిపోయారేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌