‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ అంతసేపు ఉంటాడా.. అయితే పూనకాలే!

By team teluguFirst Published Dec 20, 2022, 1:45 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ పాత్ర నిడివిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. చిరు - రవితేజ మాసీజానికి థియేటర్లు బద్దలవుతాయని తెలుస్తోంది.
 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - శృతి హాసన్  జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కూడా చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం సినిమాపై హైప్ ను తీసుకొచ్చింది. గతంలో ‘అన్నయ్య’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’తో మాసీజాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. 

తాజాగా రవితేజ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో రవితేజ చాలా సమయం కనిపిస్తాడంట. సినిమా రన్ టైం మొతంగా 2 గంటల 35 నిమిషాలు ఉంటే.. అందులో 45 నిమిషాలు రవితేజనే ఆటాడేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. చిత్రంలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు దొంగ -పోలీసు తరహాలో పాత్రలు సాగుతాయని అంటున్నారు. మొత్తానికి చిరు - రవితేజ మాస్ లుక్స్ కు మరో 20 రోజుల్లో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు.

ఇప్పటికే మాస్ మహారాజాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ లో రవితేజ ఊరమాస్ లుక్, అటిట్యూడ్ తో దుమ్ములేపారు. ‘ఏం రా వారి పిస పిస చేస్తున్నావ్’అని చెప్పే డైలాగ్స్ కు ఇంటర్నెట్ లో దుమ్ములేపుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ ‘ధమాకా’తో డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.
 

click me!