మహేష్ కు నో చెప్పిన విజయశాంతి...అసలు కారణం ఇదీ!

Published : Mar 21, 2019, 09:46 AM IST
మహేష్ కు  నో చెప్పిన విజయశాంతి...అసలు కారణం ఇదీ!

సారాంశం

రీసెంట్ గా  ఎఫ్ 2 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే . 

రీసెంట్ గా  ఎఫ్ 2 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే . కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి ని తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి . తెలుగులో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ని సొంతం చేసుకున్న విజయశాంతి లేడీ అమితాబ్ గా వెలిగిపోయారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లి ఆమె  కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు .  అయితే విజయశాంతిని మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు అనిల్ రావిపూడి . 

మహేష్ తో సినిమా అంటే ఖచ్చితంగా విజయశాంతి ఒప్పుకుంటుందనే నమ్మకం కూడా అభిమానుల్లో ఉంది. గతంలో  కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన  కొడుకు దిద్దిన కాపురం చిత్రం లో విజయశాంతి ,మహేష్ బాబు నటించారు అందులో విజయశాంతి హీరోయిన్ కాగా మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషించాడు . 1989 లో రిలీజ్ అయిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. 

దాంతో మళ్లీ  30 ఏళ్ల తర్వాత మళ్ళీ మహేష్ బాబు – విజయశాంతి కలిసి నటించనుందని వార్తలు వస్తూండటంతో భలే క్రేజీ కాంబినేషన్ అని అంతా ఆనందపడ్డారు. అయితే విజయశాంతి నో చెప్పారట.ప్రస్తుతానికి తనకు నటించే ఉద్దేశం లేదంటూ నైస్ గా  తప్పించుకుందట. 

అందుకు కారణం లేడీ అమితాబచ్చన్‌గా పేరు తెచ్చుకున్న తను ఇలాంటి చిన్న చిన్న పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తే ఉన్న పేరు చెడగొట్టుకోవడమే అవుతుందన్న ఉద్దేశంతో ఆ సినిమాకి నో చెప్పిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ సినిమాతోనే విజయశాంతి రీ ఎంట్రీ అనే వార్తలు మాత్రం ఆగడం లేదు. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌