'ఆర్ ఆర్ ఆర్' టెస్ట్ షూట్ కాన్సిల్.. అసలు కారణం

By Surya PrakashFirst Published Jul 10, 2020, 11:22 AM IST
Highlights

సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత నెలలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుకున్నట్లు గా టెస్ట్ షూట్ ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో  అసలు తెర వెనక ఏం జరిగింది. ప్రభుత్వం అడ్డుపడిందా..లేక వేరే కారణమా అనే చర్చ మొదలైంది.

దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత తెలుగు సినిమా షూటింగ్స్  ప్రారంభం అవుతాయని అందరూ ఆశించారు. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం అందరిలో ఆనందం కలగచేసింది. హైదరాబాద్ గండిపేట పరిసర ప్రాంతాల్లో టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నారని అందరూ భావించారు. ట్రైల్ షూటింగ్ మొదట డమ్మీ ఆర్టిస్ట్ లతో చేస్తున్నారని ఆ తర్వాత ఎన్టీఆర్ చరణ్ లు నటించబోతున్నారూ అంటూ ప్రచారం జరిగింది. అయితే అంతే వేగంగా సర్దుమణిగింది. ఎందుకు రాజమౌళి వెనకడుగు వేసినట్లు అనేది ఇండస్ట్రీలో క్వచ్చిన్ మార్క్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి ..మొదట టెస్ట్ షూట్ ద్దామనుకున్నా అంత తక్కువ మంది క్రూ మెంబర్స్ తో సాద్యం కాదని వెనకడుగు వేసారట. తన కోర్ టీమ్ తో కూర్చుని లెక్కలు వేసి ఎంత తగ్గించుకుని చేద్దామన్నా మినిమం 250 నుంచి 300 మంది తేలుతున్నారట. ఇప్పుడున్న పరిస్దితుల్లో అంత ఎక్కువమందితో షూటింగ్ కు ఫర్మిషన్ రాదు. పోనీ కష్టపడి తెచ్చుకున్నా వారిని కంట్రోలు చేయటం కష్టం. దానికి తోడు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన టీవి సీరియల్స్ లో ఇరవై నుంచి ముప్పై మంది దాకా కరోనా వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి పూర్తిగా వెనక్కి తగ్గారట.
  
ఇక రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి మిగతా సినిమాలు షూటింగ్‌ల‌ు మొదలు పెట్టాలనుకుున్నారు.  మొత్తం పరిశ్రమ కోసం రాజమౌళి ఈ ముందడగు వేద్దామనుకున్నా వెనక్కి తగ్గారు. ఈ షూట్ అయ్యాక తాము సెట్ పై ఎదుర్కొన్న సమస్యలు, ఎలా ఇబ్బందులను అధిగమనించారు వంటివి వీడియో రూపంలో మీడియాకు రిలీజ్ చేస్తారని ఆశగా చూసిన వారికి నిరాశే మిగిలిది. `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.  
 

click me!