విశ్వక్ సేన్ కి నందమూరి హీరోల సపోర్ట్... కారణం?

By Sambi ReddyFirst Published Mar 18, 2023, 11:16 AM IST
Highlights


హీరో విశ్వక్ సేన్ కి నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణల నుండి ఫుల్ సపోర్ట్ దక్కుతుంది. ఇది ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. విశ్వక్ సేన్ కి ఈ టాప్ స్టార్స్ మద్దతు ఇవ్వడం వెనుక కారణం ఏంటనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. 
 


విశ్వక్ సేన్ టైం బాగుంది. ఆయనకు ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ మద్దతు లభించింది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న నందమూరి హీరోలను మంచి చేసుకున్న విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ మూవీ విషయంలో భారీగా లాభపడే సూచనలు కలవు. ఎలాంటి సంబంధం లేకపోయినా... విశ్వక్ సేన్ కి బాలయ్య, ఎన్టీఆర్ ఇంత ఫేవర్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. శుక్రవారం జరిగిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మీద ప్రశంసలు కురిపించాడు. 

ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ఆహ్వానించేందుకు విశ్వక్ ఆయన నివాసానికి వెళ్ళాడట. విశ్వక్ కి ఆతిథ్యం ఇచ్చిన ఎన్టీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశాడట. ఈ విషయాన్ని ఈవెంట్లో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. అలాగే విశ్వక్ మీద సింపతీ పెరిగేలా కొన్ని డైలాగ్స్ కొట్టారు. ఎన్టీఆర్ అతిథిగా రావడం ద్వారా దాస్ కా ధమ్కీ చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. గత చిత్రాలతో పోల్చితే దాస్ కా ధమ్కీ చిత్రానికి చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ దక్కే సూచనలు కలవు. పాజిటివ్ టాక్ వస్తే సూపర్ హిట్ ఖాయం.

అలాగే విశ్వక్ మరో నందమూరి హీరో బాలయ్యను కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అడగ్గానే బాలయ్య విశ్వక్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు. బాలయ్యతో దిగిన ఫోటోలు విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు విశ్వక్ సేన్ నందమూరి హీరోలకు ఇంత దగ్గరెలా అయ్యారు? దీనికి కారణం ఏంటనే? చర్చ జరుగుతుంది. ఆ మధ్య విశ్వక్ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. అప్పుడు బాలయ్యతో విశ్వక్ కి పరిచయం ఏర్పడింది. 

ఈ మధ్య కాలంలో నందమూరి హీరోలైన ఎన్టీఆర్, బాలకృష్ణ ఉమ్మడిగా ఒకరిని సప్పోర్ట్ చేసింది లేదు. స్టార్ కిడ్స్ కి సప్పోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా అవుట్ సైడర్స్ ని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. విశ్వక్ తన లౌక్యంతో ఎన్టీఆర్, బాలయ్యల మనసు గెలుచుకుని... ఇలా ప్రయోజనం పొందుతున్నారన్న వాదన వినిపిస్తోంది. 
 

click me!