#NTR30 లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ..ఏంటి సంగతి?

Published : Mar 23, 2023, 03:05 PM IST
#NTR30 లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ..ఏంటి సంగతి?

సారాంశం

 ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ ఒక్కసారిగా కొన్ని రెట్లు పెరిగిపోయింది. దేశమంతటా నాటు నాటు అని మారు మ్రోగిపోవటంతో హిందీలోనూ ఎన్టీఆర్ కు మార్కెట్ ఎర్పడింది.


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌ తదితరులు సందడి చేశారు.  రాజమౌళి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతవరకూ మామూలుగానే ఉంది. అయితే ఈ ఈవెంట్ లో టీ సీరిస్ ఓనర్, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టి భూషణ్ కుమార్ సైతం ఉండటం చాలా మందిని ఆలోచనలో పడేసింది. అంత పెద్ద ప్రొడ్యూసర్ ఈ ఈవెంట్ లో ఏమి పని ఉంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవిల్ లో హిందీ బెల్ట్ లో రిలీజ్ చేయటానికి భూషణ్ కుమార్ ముందుకు వచ్చారని సమాచారం. అందుకే ఆయన ఈ లాంచ్ కు హాజరయ్యారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ ఒక్కసారిగా కొన్ని రెట్లు పెరిగిపోయింది. దేశమంతటా నాటు నాటు అని మారు మ్రోగిపోవటంతో హిందీలోనూ ఎన్టీఆర్ కు మార్కెట్ ఎర్పడింది. ఈ నేపధ్యంలో భూషణ్ కుమార్ ఈ సినిమాలో పెట్టుబడి పెడుతున్నారని, ముందుగానే హిందీ రైట్స్ కోసం అడ్వాన్స్ లు చెల్లించినట్లు వినికిడి. అంతేకాదు త్వరలో టాలీవుడ్ స్టార్స్ తో భూషణ్ కుమార్ సినిమాలు చేయబోతున్నట్లు వినికిడి. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌పై  చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జక్కన్న క్లాప్‌ కొట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. #NTR30, #NTR30StormBegins వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

కొరటాల శి మాట్లాడుతూ..‘‘జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌గారితో సెకండ్‌ టైమ్‌ సినిమా చేస్తున్నాను. ఆయనతో మ‌ళ్లీ పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం. నా బ్ర‌ద‌ర్ ఆయ‌న‌. ఈ జెనరేషన్‌ బెస్ట్ యాక్టర్‌ ఎన్టీఆర్‌. NTR 30 ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌లో తెర‌కెక్క‌బోయే క‌థ‌. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. ఆ మృగాళ్ల‌కు భయమంటే ఏంటో తెలియదు. దేవుడంటే..చావంటే భయం లేదు. కానీ వారంద‌రికీ ఉండే ఒకే ఒక భ‌యం ఉంటుంది. అదేంటో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది.
 
భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌. చాలా బిగ్‌ మూవీ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో ఇదే నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్‌ చేస్తున్నా. ఇంత పెద్ద ఐడియాను తీసుకెళ్లడానికి నాకు గ్రేట్‌ ఆర్మీ కావాలి. ఇంత మంది గొప్ప టెక్నీషియన్లు నాతో పనిచేశారు. ఈ కథకు ప్రాణం పోయాలంటే నేనెంత రాయాలో, అనిరుద్‌ అంత చేయాలి. క‌థ విన‌గానే చాలా ఫైర్‌తో రాశారు సార్‌ ఈ కథ అని అనిరుద్‌ అన్నారు.

లెజెండరీ ఎడిట‌ర్‌ శ్రీకర్‌ప్రసాద్‌గారు స్క్రిప్టింగ్‌ టైమ్‌ నుంచే నాతో ఉన్నారు. రత్నవేలు సార్‌, సినిమా స్టార్ట్ కావడానికి ముందే నాతో ఏడాదిగా ట్రావెల్‌ అవుతున్నారు.సాబు సార్‌ తప్ప, నా ఊహకి రూపం ఇవ్వడానికి ఇంకెవరూ లేరు. నా ఫ్రెండ్‌ యుగంధర్‌ నాతో పనిచేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ కి పనిచేస్తున్నారు. జాన్వీ హీరోయిన్‌గా చేస్తున్నారు. సెట్స్ లో ఫన్‌ ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది