'గీత గోవిందం': బన్ని వద్దనటానికి రీజన్ ఇదే

By Surya PrakashFirst Published Apr 27, 2020, 1:29 PM IST
Highlights

పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ హీరో అయిన అల్లు అర్జున్ ఇంత సూపర్ హిట్ కథను ఎందుకు చేయలేదనే సందేహం చాలా మందికి కలిగింది. అందుకు సంభందించిన విషయాలు బయిటకు వచ్చాయి. 


 రష్మిక, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీత గోవిందం థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసి వదిలింది. తొలి ఆటతోనే వీరి లవ్ స్టోరీని సూపర్ హిట్ అని తేల్చేశారు ప్రేక్షకులు. కలెక్షన్స్ అదిరిపోయాయి. స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కావడం మరింత కలిసొచ్చింది. సెలవురోజు కావడంతో తొలిరోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. ఆ తర్వాత శుక్రవారం కొత్త సినిమాలేవీ రాలేదు. జ్యోతిక ‘ఝాన్సీ’ వచ్చినా.. అది డబ్బింగ్ సినిమా కావడంతో ఎవరు అటువైపు చూడలేదు. ఆ విధంగా  పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. 

అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ హీరో అయిన అల్లు అర్జున్ ఇంత సూపర్ హిట్ కథను ఎందుకు చేయలేదనే సందేహం చాలా మందికి కలిగింది. అందుకు సంభందించిన విషయాలు బయిటకు వచ్చాయి. ఈ సినిమా కథతో గీతా ఆర్ట్స్ కి దర్శకుడు పరశురామ్ వచ్చినప్పుడు, అల్లు అర్జున్ అక్కడే వున్నాడట. పరశురామ్ కథ వినిపించిన తరువాత, ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాలో తను చేయాలని ఆశపడ్డాడట కూడా.

 అయితే అంతకు ముందు 'సరైనోడు' వంటి మాస్ హిట్ ఇచ్చిన తను, ఆ వెంటనే ఇంతటి సున్నితమైన లవ్ స్టోరీ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడట. ఈ కథకు కొత్త హీరో అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మరో ప్రక్కన అల్లు అరవింద్ బ్యానర్ లో చేయటానికి విజయ్ దేవరకొండ ఎగ్రిమెంట్ ఉంది. దాంతో విజయ్ దేవరకొండ ని సీన్ లోకి తీసుకొచ్చారు. అయితే విజయ్ దేవరకొండ మొదట ఈ కథ నచ్చలేదట. సినిమా రిలీజ్ అయ్యేదాకా పెద్ద నమ్మకంతో లేరట. కాకపోతే నిజాయితీగా నటించటం సినిమాకు కలిసొచ్చింది. విజయ్ దేవరకొండ కాకపోతే వేరే హీరో అయితే ఈ స్దాయి హిట్ కొట్టకపోదురు అనే నమ్మకం కలిగించాడు. 

ఇక హీరోయిన్‌ గా రష్మిక కూడా తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేసి..తన సత్తా  ఏంటో చూపించింది. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ చాలా బాగా చూపించింది.  చాలా సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతో పోటి పడి నటించింది.  గీత గోవిందం సినిమా విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు పరశురాం. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. ఓవరాల్ గా చూస్తే ‘గీత గోవిందం’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.
 

click me!