విడాకులతో దివాళా తీశానన్న కమల్... మాజీ భార్య వాణి గణపతి కౌంటర్!


కమల్ హాసన్ మాజీ భార్య గతంలో ఆయన గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకులతో దివాళా తీశానన్న కమల్ కామెంట్స్ ని ఆమె ఖండించారు. 
 

Google News Follow Us

నటుడిగా ఎనలేని కీర్తి ఆర్జించిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నాయి. వాణి గణపతి, సారికలను వివాహం చేసుకున్న కమల్ హాసన్ నటి గౌతమితో సహజీవనం చేశాడు. వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. 1988లో విడాకులు తీసుకున్నారు. వాణి గణపతి కి చెల్లించిన విడాకుల భరణంతో దివాళా తీశానని కమల్ హాసన్ చెప్పగా 2015లో ఆమె కౌంటర్ ఇచ్చారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన వాణి గణపతి కమల్ హాసన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. 

వాణి గణపతి మాట్లాడుతూ... మేము విడిపోయి 28 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత అతడు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కమల్ హాసన్ తో విడాకుల విషయంపై నేను మౌనం వహించాను. కారణం ఇది వ్యక్తిగత వ్యవహారం. అయితే కొన్ని విషయాలపై మాట్లాడకపోతే నేను అంగీకరించినట్లు అవుతుంది. కమల్ హాసన్ నాకు భరణం ఇవ్వడంతో దివాళా తీశాడు అనడంలో నిజం లేదు. ఏ కోర్టు మాత్రం అలాంటి భరణం విదిస్తుంది చెప్పండి. కమల్ అలాంటి కామెంట్స్ చేశాడని తెలిసి షాక్ అయ్యాను. 

నేను విడాకులు తీసుకుని అతని జీవితం నుండి వెళ్ళిపోయాను. అది కమల్ హాసన్ అహాన్ని దెబ్బతీసి ఉండొచ్చు. కమల్ హాసన్ తో 12 ఏళ్ళు కలిసి ఉన్నాను. అతని గురించి నాకు బాగా తెలుసు. తాను సమాధానం చెప్పకూడదు అనుకుంటే చెప్పడు. ఫేక్ స్మైల్ తో సందర్భాన్ని దాటి వేసి వెళ్ళిపోతాడు, అని అన్నారు. 

వాణితో విడాకుల తర్వాత కమల్ హాసన్ హీరోయిన్ సారికతో సహజీవనం చేశాడు. అనంతరం వివాహం చేసుకున్నాడు. శృతి హాసన్, అక్షర హాసన్ ఆమె కుమార్తెలు. 2004లో ఆమెకు విడాకులు ఇచ్చారు. 2004 నుండి 2016 వరకు హీరోయిన్ గౌతమ్ తో కమల్ హాసన్ ఉన్నాడు. గౌతమి ఓ సందర్భంలో కమల్ హాసన్ పై ఆరోపణలు చేశారు.