చెల్లి మరణంతో కృంగిపోయిన విజయ్... ఏడాది పాటు డిప్రెషన్

By team teluguFirst Published Jul 11, 2021, 3:59 PM IST
Highlights

విజయ్ కి తోడబుట్టిన చెల్లెలు ఉండేదిట. ఆ అమ్మాయి పేరు విద్య కాగా, రెండేళ్ల ప్రాయంలో అనారోగ్యం బారినపడిందట. వైద్యులను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లేక పోయిండట. దీనితో రెండేళ్ల ప్రాయంలో విద్య కన్నుమూసిందట.

కోలీవుడ్ లో టాప్ స్టార్ ఎవరంటే నిస్సందేహంగా తలపతి విజయ్. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నెమ్మదించాక ఆ స్థానాన్ని విజయ్ కైవసం చేసుకున్నాడు. దానికి ఆయన చిత్రాల రికార్డ్స్ నిదర్శనం. ఈ టాప్ స్టార్స్ బాల్యంలో అత్యంత గడ్డుపరిస్థితి ఎదుర్కొన్నాడట. ఆయన ఏడాది పాటు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు ఆయన తల్లి గారు తెలియజేశారు. 


విజయ్ కి తోడబుట్టిన చెల్లెలు ఉండేదిట. ఆ అమ్మాయి పేరు విద్య కాగా, రెండేళ్ల ప్రాయంలో అనారోగ్యం బారినపడిందట. వైద్యులను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లేక పోయిండట. దీనితో రెండేళ్ల ప్రాయంలో విద్య కన్నుమూసిందట. విద్య మరణం విజయ్ ని షాక్ కి గురిచేసిందట. ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే విజయ్ చెల్లెల్లితో ఆడుకునేవాడట. ఎంతో ప్రేమించే చెల్లి మరణంతో విజయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. 

ఏడాది పాటు ఎవరితో మాట్లాడకుండా విజయ్ అలానే ఉండిపోయాడట. విజయ్ ఆ స్ట్రగుల్ నుండి బయటపడడానికి కారణం సినిమా అంటూ వాళ్ళ మదర్ ఓ సందర్భంలో తెలియజేశారు. సినిమా ప్రపంచంపై మక్కువ పెంచుకున్న విజయ్ హీరో కావాలనే కోరికతో మాములు మనిషిగా మారాడట. ఇక వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విజయ్ ప్రస్తుతం బీస్ట్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 
 

click me!