తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకొని టీ తాగు- నీ ఆత్మకు శాంతి కలగాలి... వర్మ-నాగబాబు మధ్య వార్!

By Sambi ReddyFirst Published Dec 29, 2023, 1:42 PM IST
Highlights

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు నాగబాబు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. 
 

ఇటీవల ఓ టీవీ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి దర్శకుడు వర్మకు ప్రాణహాని కలిగించే కామెంట్స్ చేశాడు. దాంతో నాకు ప్రాణాపాయం ఉందని టీవీ 5 యాజమాన్యం, యాంకర్ సాంబశివరావు, కొలికపూడి శ్రీనివాస్ పై దర్శకుడు వర్మ కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు. ఇలాంటి కామెంట్స్ సమర్ధించ రానివి. అయితే వర్మగారు మిమ్మల్ని ఏ వెధవ చంపడు. ఎందుకంటే హీరో విలన్ మధ్య కొట్లాటలో కమెడియన్ ని చంపరు కదా... కాబట్టి మీరు హ్యాపీగా ఓడ్కా ఓ పెగ్గేసి పడుకోండి, అని కామెంట్ చేశాడు. 

దీనికి స్పందిస్తూ వర్మ... నాకన్నా పెద్ద కమెడియన్ ఎవరంటే... నా సినిమాల్లో నువ్వు. నీ తమ్ముడు దగ్గర డబ్బులు తీసుకుని టీ తాగి పడుకో, అని రిప్లై ఇచ్చాడు. వర్మ కౌంటర్ కి నాగబాబు మరో కౌంటర్ ఇచ్చాడు. నా పోస్ట్ కి రెస్పాండ్ అయినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో ఆశ్చర్యంగానూ ఉంది. ఎందుకంటే ఓ ఇరవై ఏళ్ల క్రితమే మీరు చనిపోయారు. మీ ఆత్మ మాత్రమే తిరుగుతుంది. 

Latest Videos

కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను, అని కౌంటర్ వేశాడు. మరి నాగబాబు కౌంటర్ కి వర్మ  ఎన్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. దర్శకుడు వర్మ వ్యూహం టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. నిజ జీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కించిన వ్యూహంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తప్పుగా చూపించాడనే వాదన ఉంది. దీంతో వ్యూహం విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు వ్యూహం విడుదల ఆపాలన్న తెలుగు దేశం పార్టీ కోరిక నెరవేరింది. నేడు వ్యూహం విడుదల కాలేదు. కోర్ట్ ఆదేశాలతో వ్యూహం రిలీజ్ కి బ్రేక్ పడింది. 

సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి 😎😎😎 pic.twitter.com/RbhusBDNvf

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!