AVAK Movie: విశ్వక్ సేన్ దురదృష్టం... ఓ భారీ హిట్ కోల్పోయిన యంగ్ హీరో!

By Sambi ReddyFirst Published May 14, 2022, 1:18 PM IST
Highlights

హిట్ టాక్ తెచ్చుకొని కూడా ప్రయోజనం పొందలేకపోయాడు విశ్వక్ సేన్(Vishwak Sen). ఆయన ఎంచుకున్న విడుదల తేదీ కారణంగా వసూళ్లపరంగా దెబ్బైపోయాడు. పెద్ద సినిమాల మధ్యలో పడి నలిగిపోయాడు. 
 


హిట్ టాక్ తోపాటు చక్కని టైమింగ్ కుదిరినప్పుడే సక్సెస్ సొంతం అవుతుంది. ఆ టైమింగ్ మిస్సైన అశోకవనంలో అర్జున కళ్యాణం( Ashokavanamlo Arjuna kalyanam) పూర్తి స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. చిన్న చిత్రాల విడుదల ఓ యజ్ఞం అని చెప్పాలి. పెద్ద చిత్రాల విడుదల ఉంటే అసలు థియేటర్స్ దొరకవు. థియేటర్స్ దొరికినా ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. హిట్ టాక్ తెచ్చుకున్నా పెద్ద చిత్రాలు విడుదలైతే చిన్న సినిమాలను థియేటర్స్ నుండి తీసేస్తారు. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ పరిస్థితి అదే అయ్యింది. 

అనేక వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. మే 6న కేవలం చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. అయితే ఆర్ ఆర్ ఆర్, కె జి ఎఫ్2 చిత్రాల హవా ఇంకా నడుస్తూ ఉండగా పరిమిత సంఖ్యలోనే అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి థియేటర్స్ లభించాయి. అయితే నెక్స్ట్ వీక్ మహేష్ మూవీ సర్కారు వారి పాట విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక థియేటర్స్ ఆ చిత్రానికి కేటాయించారు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ రన్ ఉన్న విశ్వక్ మూవీ థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. 

మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న అశోకవనంలో అర్జున్ కళ్యాణం మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉన్నా... మహేష్ (Mahesh Babu)రాకతో అది కుదరలేదు. నిజానికి చిన్న చిత్రాల వసూళ్లు లాంగ్ రన్ పైనే ఆధారపడి ఉంటాయి. మౌత్ టాక్ బాగుంటే క్రమంగా వసూళ్లు పెరుగుతాయి. విశ్వక్ సేన్ సినిమాకు ఆ అవకాశం లేకుండా పోయింది. దాదాపు రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మొదటి వారం ముగిసేనాటికి బ్రేక్ ఈవెన్ చేరింది. ఇక లాభాలు మొదలయ్యే సమయానికి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)రూపంలో కలెక్షన్స్ కోల్పోయింది. అయితే ఇప్పటికీ ఎంతో కొంత వసూళ్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ భారీ వసూళ్లు సాధించే ఛాన్స్ కోల్పోయింది. 

click me!