వైరల్ వీడియో: ఉంటానమ్మా తారక్... సీ యూ బాబాయ్... ఎన్టీఆర్-నాగ్ బాండింగ్ కి ఇదే నిదర్శనం!

By Sambi ReddyFirst Published Sep 4, 2022, 3:38 PM IST
Highlights


ఎన్టీఆర్, నాగార్జున బాండింగ్ కి ఈ వీడియోనే నిదర్శనం. బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్ అనంతర తమ కార్ల వద్దకు వచ్చిన ఎన్టీఆర్, నాగ్ వీడ్కోలు చెప్పుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

పరిశ్రమలో నాగార్జునను అజాతశత్రువు అనవచ్చు. ఆయన అన్ని జెనరేషన్ హీరోలతో కలిసిపోతారు. ఎవరితో శత్రుత్వం పెట్టుకున్న, విమర్శించిన సందర్భం లేదు. తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అదే సమయంలో అందరితో మంచి రిలేషన్స్ మైంటైన్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవితో నాగార్జునకు ప్రత్యేక రిలేషన్ ఉంది. తరచుగా వీరిద్దరూ కలుస్తారు. చిరంజీవితో పాటు నాగార్జున అమితంగా ఇష్టపడే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ప్రేమగా నాగార్జున ఎన్టీఆర్ ని తారక్ అని పిలుస్తాడు. ఇక ఎన్టీఆర్ ఆయన్ని బాబాయ్ అంటారు. 

ఈ అనుబంధంతోనే బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ వేడుకకు గెస్ట్ గా నాగార్జున ఎన్టీఆర్ ని ఆహ్వానించాడు. అనుకోని కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రెస్ మీట్ గా ముగించారు. రన్బీర్ కపూర్, అలియా భట్, రాజమౌళి, నాగార్జున పాల్గొన్న బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. బ్రహ్మాస్త్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. మొత్తం టీం కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. 

నాగ్ : తారక్ ఉంటానమ్మ....
తారక్: బాబాయ్ see you బాబాయ్

❤❤❤❤👑🐅❤❤❤❤
Cutest video ❤
pic.twitter.com/uctnQoYe5P

— 🕸 (@BeingKingg)

ఈవెంట్ ముగిశాక కారు వరకు నాగార్జున, ఎన్టీఆర్ కలిసి వచ్చారు. ఇద్దరినీ ప్రెస్ చుట్టుముట్టగా... నాగార్జున తన కార్ వద్దకు వెళుతూ ''తారక్ ఉంటానమ్మా'' అన్నారు. దానికి సమాధానంగా ఎన్టీఆర్ ''సీయూ బాబాయ్'' అని సెండాఫ్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఎన్టీఆర్-నాగ్ మధ్య ఉన్న అనుబంధం గురించి నెటిజెన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. 

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో కూడా నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సీతారామరాజు సూపర్ హిట్ అందుకుంది.  ఆ మూవీలో హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా నటించారు. ఇక నిఖిల్ మూడో చిత్రం మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఎన్టీఆర్ పరిశ్రమలో అతికొద్ది మంది మిత్రులను కలిగి ఉన్నారు. నాగార్జునతో పాటు రామ్ చరణ్, మహేష్ తో ఆయన సన్నిహితంగా ఉంటారు.  
 

click me!