కరోనాతో పోరాటంలో.. సీఎం నిధికి `ఉప్పెన` స్టార్‌ విజయ్‌ సేతుపతి సహాయం..

Published : Jun 15, 2021, 02:04 PM IST
కరోనాతో పోరాటంలో.. సీఎం నిధికి `ఉప్పెన` స్టార్‌ విజయ్‌ సేతుపతి సహాయం..

సారాంశం

`ఉప్పెన` ఫేమ్‌ విజయ్‌ సేతుపతి తమిళనాడు సీఎం నిధికి రూ. 25లక్షలు డొనేట్‌ చేశారు. మంగళవారం ఆ అమౌంట్‌కి సంబంధించిన చెక్‌ని సెక్రెటరీలోని సీఎంని కలిసి అందజేశారు.

`మక్కల్‌ సెల్వన్‌` విజయ్‌ సేతుపతి గొప్ప మనసుని చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో తనవంతుగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన తమిళనాడు సీఎం నిధికి రూ. 25లక్షలు డొనేట్‌ చేశారు. మంగళవారం ఆ అమౌంట్‌కి సంబంధించిన చెక్‌ని సెక్రెటరీలోని సీఎంని కలిసి అందజేశారు. కరోనాతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుండాలనే ఉద్దేశంతో తనవంతు సహాయం చేసినట్టు తెలిపారు. 

గతంలో తమిళనాడు సీఎం నిధికి సూర్య, కార్తీ, శివకుమార్‌ ఫ్యామిలీ, రజనీకాంత్‌ కూతురు, శంకర్‌, మురుగదాస్‌, అజిత్‌, ఉదయ్‌నిధి స్టాలిన్‌, విక్రమ్‌, శివకార్తికేయన్‌, వెట్రిమారన్‌ వంటి సినీ ప్రముఖులు సీఎం నిధికి తమ వంతు విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్‌ సేతుపతి ముందుకొచ్చాడు. 

ఇక విజయ్‌ సేతుపతి `ఉప్పెన` సినిమాలో నెగటివ్‌ రోల్‌ చేసి ఆకట్టుకున్నారు. సినిమాకి జీవం పోశారు. అంతకుముందు `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేశారు. అలాగే తమిళంలో చివరగా విజయ్‌తో కలిసి `మాస్టర్` చిత్రంలో నటించారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి చేతిలో 14 సినిమాలున్నాయి. అందులో ఒకటి మలయాళం, మరోటి హిందీ సినిమా కావడం విశేషం. దీంతోపాటు కొత్తగా కళైపులి ఎస్‌ థాను ప్రొడక్షన్‌లో రెండు సినిమాలకు అగ్రీమెంట్‌ చేసుకున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్