మీరు బ్యానర్స్ చింపేస్తే...మేం ల్యాప్ టాప్ లు పగలకొడతాం

By Prashanth MFirst Published Nov 11, 2018, 1:23 PM IST
Highlights

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్‌’వివాదం అంత తేలిగ్గా చల్లారేటట్లులేదు. ప్రభుత్వమే పగపట్టినట్లుగా ఈ సినిమాకు వ్యతిరేకంగా వ్యవహించటంతో చెన్నై లో ఎక్కడా ఈ సినిమాకు సంభందించి బ్యానర్ కానీ, ప్లెక్సీ కానీ లేకుండా పోయింది.

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్‌’వివాదం అంత తేలిగ్గా చల్లారేటట్లులేదు. ప్రభుత్వమే పగపట్టినట్లుగా ఈ సినిమాకు వ్యతిరేకంగా వ్యవహించటంతో చెన్నై లో ఎక్కడా ఈ సినిమాకు సంభందించి బ్యానర్ కానీ, ప్లెక్సీ కానీ లేకుండా పోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ కు మండుకొచ్చింది. వెంటనే ప్రభుత్వానికి కౌంటర్ గా...  తమ ఇంట్లో ఉన్న ఉచిత మిక్సీ, గ్రైండర్లను పగలగొడుతున్నారు.. మరి కొందరు అభిమానులైతే.. ఏకంగా ఉచిత ల్యాప్‌టాప్‌లను కూడా నేలకేసి బాదుతూ ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. 

వాస్తవానికి ఈ సినిమాపై పాలకపార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం కూడా అదే...సినిమాలో ఉచిత మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాన్‌ను పగలగొట్టే సన్నివేశాన్ని తొలగించాలని... కోమలవల్లి అనే పేరును మ్యూట్‌ చేయాలని. అందుకోసం  అన్నాడీఎంకే వర్గాలే ఆందోళనకు దిగారు.  పార్టీ కార్యకర్తలు ‘సర్కార్‌’ థియేటర్లపై దాడి చేశారు. అన్ని బ్యానర్లను చించివేశారు. 

ఇది గమనించిన ఫ్యాన్స్  మాత్రం విజయ్‌కి పెద్దస్థాయిలో అండగా నిలుస్తున్నారు. ‘సపోర్ట్‌ విజయ్‌’ హ్యాష్‌టాగ్‌ పేరిట సోషల్ మీడియాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమాను సినిమాలా చూడకుండా, రాజకీయ కోణంలో చూడటంమే సమస్యను తెచ్చిపెట్టింది. 

ఖచ్చితంగా .. ఈ విషయాలన్నీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కూడా పేర్కొంటున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘మహానటి’ ఫేం కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించారు.

click me!