‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్‌లో ఓ వెబ్ సిరీస్

By Surya PrakashFirst Published Aug 18, 2020, 7:46 AM IST
Highlights

ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేసారు. విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్ని అర్జున్ రెడ్డితోటే పోల్చి చూడటం...ఆడకపోవటం కూడా జరిగింది.

తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిన సినిమా అర్జున్‌ రెడ్డి. బోల్డ్‌ కంటెంట్‌తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేసారు. విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్ని అర్జున్ రెడ్డితోటే పోల్చి చూడటం...ఆడకపోవటం కూడా జరిగింది.  

మరో ప్రక్క ‘అర్జున్ రెడ్డి’ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం జరిగింది. బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం సందీప్ వంగ  – విజయ్ దేవరకొండ కలిసి ఒక వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ వెబ్ సిరీస్ లో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తాడట. అంటే మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  ప్రస్తుతం ఈ హీరో.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 

బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ, పూరి, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 40 రోజుల ముంబై షెడ్యూల్‌ను లాక్ డౌన్ కు ముందు  పూర్తి చేశారు. త్వరలో తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందని టాక్‌.

click me!