అనసూయకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Published : Jan 20, 2019, 09:49 AM IST
అనసూయకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

సారాంశం

ఆ మధ్యన విజయదేవరకొండపై అనసూయ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. దాంతో అందరూ స్టార్ గా ఎదుగుతున్న విజయ్ దేవరకొండతో కోరి తగువు పెట్టుకుంది..

ఆ మధ్యన విజయదేవరకొండపై అనసూయ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. దాంతో అందరూ స్టార్ గా ఎదుగుతున్న విజయ్ దేవరకొండతో కోరి తగువు పెట్టుకుంది..కెరీర్ కు దెబ్బ అన్నారు. అలాగే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ సినిమా దేంట్లోనూ అనసూయ పాత్ర లేదు. అయితే విజయ్ దేవరకొండ ఈ విషయాలేమీ మనస్సులో పెట్టుకున్నట్లు లేడు. ఆమెను తను నిర్మిస్తున్న చిత్రంలో ఓ ప్రధాన పాత్ర ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... తాజాగా విజయ్ దేవరకొండ తనకు పెళ్లి చూపులు చిత్రంతో బ్రేక్ ఇచ్చిన దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో దాస్యం తరుణ్ భాస్కర్ కు జోడీగా హాట్ భామ అనసూయ అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారట. 

రంగస్దలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపైంది. అందరూ తమ తమ సినిమాల్లో ఆమెకు చిన్న పాత్ర అయినా ఉండాలని భావిస్తున్నారు.  దాంతో ఆమెని అప్రోచ్ కావడంతో ఓకే చేసిందని సమాచారం . క్రేజీ హీరో నిర్మిస్తున్న చిత్రం , పెళ్లిచూపులు వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన దర్శకుడు హీరోగా చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. 

ఇక పెళ్లిచూపులు చిత్రమే విజయ్ దేవరకొండ ని హీరోని చేసింది దాంతో ఆ ఋణం తీర్చుకోవడానికి కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ . దాస్యం తరుణ్ భాస్కర్ ఇప్పటికే నటుడిగా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు కానీ  ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మించబోయే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు !  వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

PREV
click me!

Recommended Stories

Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?