శ్రీకాంత్ అడ్డాల ‘కూచిపూడి వారి వీధి’హీరో ఖరారు,కమల్ కాదు

By Udayavani DhuliFirst Published Jan 20, 2019, 9:39 AM IST
Highlights

మహేష్ వంటి స్టార్ హీరోతో  ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్  ఇవ్వటంతో ఆ తర్వాత ఏ హీరో దగ్గరకు రానివ్వలేదు. విన్నా ఏ కథా ఓకే అవ్వలేదు. దానికి తోడు శ్రీకాంత్ అడ్డాల కథలు ఫీల్ గుడ్ స్టోరీల కావటంతో కథ వినే హీరోలకు మనస్సులో బ్రహ్మోత్సవం మెదిలేది. 

మహేష్ వంటి స్టార్ హీరోతో  ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్  ఇవ్వటంతో ఆ తర్వాత ఏ హీరో దగ్గరకు రానివ్వలేదు. విన్నా ఏ కథా ఓకే అవ్వలేదు. దానికి తోడు శ్రీకాంత్ అడ్డాల కథలు ఫీల్ గుడ్ స్టోరీల కావటంతో కథ వినే హీరోలకు మనస్సులో బ్రహ్మోత్సవం మెదిలేది. దాంతో  శ్రీకాంత్‌ అడ్డాలకు అవకాశాలే కరువయ్యాయి. దాంతో  లాంగ్‌ గ్యాప్‌ తరువాత రీసెంట్ గా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్‌. అందుకోసం ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు శ్రీకాంత్‌ అడ్డాల వెల్లడించారు. 

మరి ఈ చిత్రంలో హీరో ఎవరు అంటే... అందుతున్న సమాచారం మేరక శర్వానంద్ హీరోగా ఈ సినిమా ఓకే అయినట్ల తెలస్తోంది. దాదాపు మూడేళ్ల నంచీ రకరకాల లైన్స్ వినిపించిన శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ స్టోరీ లైన్, టైటిల్ నచ్చటంతో శర్వా  సై అన్నట్లు వినికిడి. శర్వా రీసెంట్ గా పడి పడి లేచే మనస్సు చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాతగా ...96 రీమేక్ చేస్తున్నారు. అందులో నడి వయస్సు  వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.

మరో ప్రక్క శ్రీకాంత్ అడ్డాల ఈ సంవత్సరం కాస్త స్పీడ్ అయ్యేటట్లు కనపడుతున్నాడు. త్వరలో    లోక నాయకుడు కమల్‌ హాసన్‌, టాలీవుడ్ సీనియర్‌ హీరో వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ కథను రెడీ చేస్తున్నట్టుగా చెప్పారు. త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్‌ అడ్డాల, తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్‌ కెరీర్‌ను తల కిందులు చేసింది. మళ్ళీ ఈ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.

click me!