రష్మిక మందన్నా బర్త్ డే.. విజయ్‌ దేవరకొండకి లక్‌ కలిసి వస్తుందా?.. ఆ రోజు కోసం రౌడీబాయ్‌ వెయిటింగ్‌..

By Aithagoni RajuFirst Published Mar 31, 2024, 5:52 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రష్మిక మందన్నా పుట్టిన రోజు తనకు కలిసి వస్తుందనే ఆశతో ఉన్నాడు విజయ్‌. 
 

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ లవర్స్ గా చెలామణి అవుతున్నారు. ఈ ఇద్దరు డేటింగ్‌ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కన్ఫమ్‌ చేయడం లేదుగానీ, హింట్లు ఇస్తూనే ఉన్నారు. రష్మిక మందన్నా ఈ విషయంలో దూకుడు మీదుందని చెప్పొచ్చు. అయితే లేటెస్ట్ గా రష్మిక మందన్నా బర్త్ డే కోసం వెయిట్‌ చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆ రోజు తనకు కలిసి వస్తుందని ఆశతో ఉన్నాడట. ఆ లక్‌ కలిసొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. 

మరి ఆ సంగతులేంటి అనేది చూస్తే.. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. ఆ రోజు సెలవు రోజు. దీంతోపాటు ఆ వీకెండ్‌ మూవీకి కలిసి రానుంది. అలాగే మండే ఉగాది ఉంది. ఇలా లాంగ్‌ వీకెండ్‌ కలిసి రాబోతుంది. దీనికితోడు చాలా వరకు ఎగ్జామ్స్ పూర్తి కావడంతో స్టూడెంట్స్ కూడా ఫ్రీ అవుతారు. సినిమాలపై ఆసక్తితో ఉంటారు. అది `ఫ్యామిలీ స్టార్‌` కి కలిసి రానుంది. 

దీంతోపాటు ఆ రోజు మరో ప్రత్యేకత ఉంది. రష్మిక మందన్నా పుట్టిన రోజు. ఆ రోజు విజయ్‌కి కలిసి వస్తుందా అనేది మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. తాజాగా విజయ్‌ తమిళ మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని తెలిపారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటని అడగ్గా, సెలవుదినం అని చెప్పాడు. అయితే రష్మిక మందన్నా పుట్టిన రోజు ఉందని చెప్పగా, ఎస్ అది లక్కీ అని, తమ సినిమాకి కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలా ఆ రోజు కోసం విజయ్‌ వెయిట్‌ చేస్తున్నారు. మరి రష్మిక బర్త్ డే విజయ్‌కి కలిసి వస్తుందా? హిట్‌తో ఆమెని సర్‌ప్రైజ్‌ చేస్తాడా? అనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

పూర్తి ఫ్యామిలీ ఎలిమెంట్లతో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌ సీన్లు మినహాయిస్తే పూర్తి ఫ్యామిలీ మూవీగా ఉంటుందని దిల్‌రాజు తెలిపారు. విడుదలైన ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంది. దీంతో మరి సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుంది? రష్మిక బర్త్ డే విజయ్‌కి కలిసి వస్తుందా? లేదా అనేది చూడాలి. ఇక తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో విజయ్‌ బిజీగా ఉన్నారు. 
 

click me!