మొన్న లండన్‌లో, ఇప్పుడు ఇటలీలో.. లగ్జరీ హౌజ్‌ కొనుగోలు చేసిన ప్రభాస్‌

Published : Mar 31, 2024, 01:28 PM IST
మొన్న లండన్‌లో, ఇప్పుడు ఇటలీలో.. లగ్జరీ హౌజ్‌ కొనుగోలు చేసిన ప్రభాస్‌

సారాంశం

డార్లింగ్‌ ప్రభాస్‌ విదేశాల్లో ఇళ్లు కొనుగోలు చేశారు. ఆ మధ్య లండన్‌లో ఇళ్లు కొన్నాడు డార్లింగ్‌. ఇప్పుడు ఇటలీలో కూడా ఇళ్లు కొన్నాడట ప్రభాస్‌.   

ప్రభాస్‌..తెలుగు నుంచి ఫస్ట్ గ్లోబల్‌ స్టార్‌. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. `బాహుబలి` చిత్రంతో డార్టింగ్‌ ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేశారో తెలిసిందే. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ ఇండియన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఆ మూవీ కలెక్షన్లని కొట్టే సినిమా రాలేదు. తన మూవీ కలెక్షన్లని తానే బ్రేక్‌ చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే `బాహుబలి` తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ఆయన పారితోషికాలు మారిపోయాయి. ఏకంగా వంద కోట్లు అందుకున్న హీరోగా ప్రభాస్‌ నిలిచారు. ఇప్పుడు ఆయన రేంజ్‌ రెండు వందల కోట్లకు పెరిగిపోయింది. 150 నుంచి 200కోట్ల వరకు పారితోషికాలు ఇస్తున్నారు. `కల్కి`, `స్పిరిట్‌`, `సలార్‌` చిత్రాలకు ఆయనకు భారీగా ఇస్తున్నారట. 

అయితే ప్రభాస్‌కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ప్రభాస్‌ ఇప్పుడు కొత్త ఇళ్లు కొన్నాడు. అది కూడా విదేశాల్లో. ఆ మధ్య లండన్‌లో ఓ లగ్జరీ హౌజ్‌ కొన్నాడు ప్రభాస్‌. షూటింగ్‌ల కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఉండటానికి ఓ ఇళ్లు కావాలని లగ్జరీ హౌజ్‌ని కొనుగోలు చేశాడట. అంతేకాదు వెకేషన్‌ కోసం వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా ఈ ఇంటిని కొన్నట్టు తెలుస్తుంది. 

మరోవైపు ఇప్పుడు మరో దేశంలో ఇళ్లు కొన్నాడట ప్రభాస్‌. ఇటలీలో కూడా ఇటీవల మరో ఇంటిని తీసుకున్నాడట. ఫ్లోరిన్స్ సిటీలో ప్రభాస్‌ ఇల్లు కొన్నాడట. ఫ్లోరిన్స్ ని ఆర్ట్ కాపిటల్‌గా చెబుతారు. హెరిటేజ్‌ సిటీగా ఉంది. ఇక్కడ ఇళ్లు ఉండాలని చెప్పి ఇటీవలే డార్లింగ్‌ ఆ ఇంటిని కొనుగోలు చేశాడట. ఆయన ఇటీవల ఇటలీకి వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన ఈ ఇంటిని తీసుకున్నట్టు తెలుస్తుంది. 

దీంతో ప్రభాస్‌ లగ్జరీ ఆస్తుల జాబితాలో లండన్‌, ఇటలీ ఇళ్లు కూడా చేరిపోయాయి. ప్రభాస్‌కి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఓ లగ్జరీ హౌజ్‌ ఉంది. అలాగే కోకాపేట సమీపంలో ఓ గెస్ట్ హౌజ్‌ కడుతున్నాడు. మరోవైపు వేల ఎకరాల ల్యాండ్‌ ఉంది. ఇలా వేల కోట్లకు అధిపతిగా ఉన్నారు డార్లింగ్‌. ప్రస్తుతం ప్రభాస్‌ `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `రాజాసాబ్‌` చేస్తున్నారు. `స్పిరిట్‌` చేయాల్సి ఉంది. అలాగే `సలార్‌ 2` తెరకెక్కబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?