నోటా విషయంలో ఓ పార్టీ గొడవ చేస్తోందని, తానే ఎందుకు దొరుతున్నానో అర్థం కావడం లేదని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే తానేమీ ఇబ్బంది పడడం లేదని, సినిమానే తన జీవితమని, అందువల్ల వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటానని ఆయన అన్నారు.
హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమా శుక్రవారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. తెలంగాణలో సినిమాను విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ గురువారం మీడియాతో మాట్లాడారు.
నోటా విషయంలో ఓ పార్టీ గొడవ చేస్తోందని, తానే ఎందుకు దొరుతున్నానో అర్థం కావడం లేదని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే తానేమీ ఇబ్బంది పడడం లేదని, సినిమానే తన జీవితమని, అందువల్ల వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటానని ఆయన అన్నారు.
undefined
బొగ్గు కుంభకోణమని, 3జీ కుంభకోణమని, వరదలనీ... ఇలా ఏది వినిపించినా ఎందుకు ఇలా జరుగుతోందనే ఆవేశం వస్తుందని, అందుకే నోటా కథ వినగానే తాను కనెక్ట్ అయ్యానని, ఆ పాత్రను తానే పోషించాలనిపించిందని ఆయన అన్నారు.
నోటా పేరు కేవలం సినిమాకు పనికి వచ్చిందని, అంతకు మించి ఏమీ లేదని, తమకు కొత్త ప్రత్యామ్నాయం కావాలనే విషయాన్ని నోటా సినిమా ద్వారా చెబుతున్నామని, త్వరలో రిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక మామూలు కుర్రాడిని లాక్కెళ్లి పోటీ చేయాలని బరిలోకి దింపితే ఈ వ్యవస్థపై ఎలా ప్రతిస్పందిస్తాడనేది తన పాత్ర అని వివరించారు.
తనకు వ్యక్తిగతంగా కేటిఆర్ అంటే ఇష్టమని, ఆయన అందరు రాజకీయ నాయకులు వేసుకున్నట్లుగా పూర్తి ఖాదీ కాకుండా మామూలు చొక్కాలు కూడా వేస్తుంటారని, ఆయన ఫక్తు యువ నాయకుడిగా కనిపిస్తారని, అందువల్ల ఆయనను అనుకరించానని, కొన్ని చోట్ల ఆయన లుక్స్ ని మక్కీ మక్కీకి దింపామని విజయ్ దేవరకొండ చెప్పారు.
బాల్యంలో చంద్రబాబు నాయకత్వమంటే ఇష్టంగా ఉండేదని, ఆయన హయాంలోనే ప్రభుత్వోద్యోగులు హడావిడి పడడం చూశానని, అలా స్ట్రిక్ట్ గా ఉంటే తనకు ఇష్టమని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ పాలన తనకు బాగా నచ్చిందని, కేటిఆర్ ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు తనను బాగా ప్రభావితం చేశాయని విజయ్ చెప్పారు. నువ్వు యాక్టర్ వి కదా, ఖాదీ వస్త్రాలను ప్రమోట్ చేయవచ్చు కదా అని చెప్పారని విజయ్ అన్నారు.